శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 15 మార్చి 2024 (15:11 IST)

గం..గం..గణేశా నుంచి విలన్స్ ను నవ్వుతూ చూస్తున్న ఆనంద్ దేవరకొండ

gam gam Ganesha news look
gam gam Ganesha news look
ఆనంద్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది "గం..గం..గణేశా" చిత్రబృందం. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆనంద్ దేవరకొండ తన కెరీర్ లో చేస్తున్న ఫస్ట్ యాక్షన్ మూవీ ఇది కావడం విశేషం.
 
"గం..గం..గణేశా" మూవీ కొత్త పోస్టర్ లో రకరకాల ఆయుధాలు పట్టుకుని మీదకు వస్తున్న విలన్స్ ను నవ్వుతూ చూస్తున్న ఆనంద్ దేవరకొండ స్టిల్ ఉంది. ఈ విలన్స్ తో పాటే రోజ్ ఫ్లవర్ ఇస్తున్న హీరోయిన్ ను కూడా చూపించడం ఇంట్రెస్టింగ్ గా ఉంది. ప్రస్తుతం "గం..గం..గణేశా" సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రానుంది.