శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 14 నవంబరు 2019 (12:52 IST)

అతిలోక సుందరి శ్రీదేవికి ఏయన్నార్ జాతీయ అవార్డు

వెండితెర అతిలోక సుందరి శ్రీదేవికి అక్కినేని నాగేశ్వర రావు జాతీయ అవార్డు వరించింది. 2018 సంవత్సరానికిగాను ఈ దివంగత నటికి ఏయన్నార్ అవార్డును ప్రదానం చేయనున్నారు. అలాగే, 2019 సంవత్సరానికి కూడా ఈ అవార్డును ప్రకటించారు. ఈ సంవత్సరానికి బాలీవుడ్ అగ్రనటి రేఖకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. 
 
నిజానికి ప్రతి యేటా అక్కినేని ఫ్యామిలీ ఏయన్నార్ జాతీయ అవార్డుల కార్యక్రమాన్ని ఎంతో ఘ‌నంగా నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌తి సంవ‌త్స‌రం ఒక్కో సెల‌బ్రిటీని ఈ అవార్డుకు ఎంపిక చేస్తూ వ‌స్తున్నారు. ఇందులోభాగంగా, గత 2017లో రాజ‌మౌళికి ఏఎన్ఆర్ అవార్డు దక్కింది. తాజాగా శ్రీదేవి, రేఖలను ఎంపిక చేశారు. 
 
ఈ విషయాన్ని టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ప్రకటించారు. అలాగే, ఈ నెల 17వ తేదీన హైదరాబాద్‌లో జరిగే ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు.