సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 24 సెప్టెంబరు 2022 (09:47 IST)

ఒక‌వైపు అనుప‌మ చోప్రా- మ‌రోవైపు శ్రీ‌ముఖితో చిరంజీవి

mega154 location
mega154 location
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన  “గాడ్ ఫాథర్” విడుదలకి సిద్ధంగా ఉంది. అక్టోబ‌ర్ 5న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా ప‌లుర‌కాల మీడియాను చిరంజీవి వినియోగించు కుంటున్నారు. తాజాగా మెగా 154 సెట్లో చిరంజీవితో చిట్‌చాట్ చేయడానికి అన్ని విధాలుగా జాతీయ స్థాయి విలేఖరి అనుప‌మ చోప్రా ప్రయ‌త్నించింది. త‌న రాబోయే సినిమాల గురించి, కొన్ని ప‌ర్స‌న‌ల్ విష‌యాల గురించి, రాజ‌కీయాల గురించి ఆమె ప్ర‌శ్న‌లు సంధించింది. 
 
chiru-srimukhi
chiru-srimukhi
అయితే ఆ విష‌యాలు త్వ‌ర‌లో తెలియ‌జేయ‌నున్న‌ట్లు తెలుపుతూ, ఆమె సెట్లో దిగిన ఫొటోను చిరంజీవి ట్వీట్ చేశాడు. మ‌రోవైపు యాంక‌ర్ శ్రీ‌ముఖితో కూడా చిరంజీవి విమానంలో తిరుగుతూ ఇంట‌ర్వూ ఇచ్చారు. ఇంది శ్రీ‌ముఖి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసి ఆనందాన్ని వ్య‌క్తం చేసుకుంది. 
 
మెగాస్టార్ తో ఇంటర్వ్యూ కోసం అనుప‌మ చోప్రా రాగా ఆమెతో షూటింగ్ సెట్స్ నుంచే త‌న టీమ్‌తో చిరు ఫోటో దిగారు. దీనితో ఈ సెట్స్ నుంచి వచ్చిన ఈ పోస్ట్ ఇప్పుడు సినీ వర్గాల్లో వైరల్ గా మారింది.