బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: మంగళవారం, 6 ఆగస్టు 2019 (18:56 IST)

వరుస హిట్లు సాధిస్తున్నా అవకాశాల్లేక ఇబ్బంది పడుతున్న హీరోయన్...

అనుపమ పరమేశ్వరన్. తెలుగులో ఈమెకు వరుస విజయాలే వస్తున్నాయి. తాజాగా ఆమె నటించిన రాక్షసుడు సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్‌నే సాధించింది. యాక్షన్, థ్రిల్లర్ సినిమా కావడంతో జనం బాగా చూశారు. అనుపమ రోల్ కూడా సినిమాలో కీలకంగా ఉండడంతో ఆమెకు మంచి మార్కులే పడ్డాయి.
 
ఇదంతా బాగానే ఉన్నా అనుపమకు ఇప్పుడు చేతిలో అవకాశాలు లేవట. తెలుగు, తమిళం రెండు భాషల్లోను అవకాశాలు లేకపోవడంతో ప్రస్తుతం ఖాళీగా ఉంటోందట అనుపమ పరమేశ్వరన్. ఈమెకు జతగా యువ నటుడినే తీసుకోవాలి. ఎందుకంటే వయస్సు అలాంటిది.
 
దీంతో తమ సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌ను తీసుకుంటామని ఏ దర్సకుడు, నిర్మాత చెప్పడం లేదట. తనకు అవకాశాలు లేవని అనుపమ కాస్త బాధపడుతున్నా.. తను నటించిన సినిమాలన్నీ హిట్ సాధించడం మాత్రం ఆమెకు బాగానే సంతోషాన్నిస్తోందట.