గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 12 సెప్టెంబరు 2022 (14:12 IST)

పేరుకే రెబెల్ స్టార్.. ఆయన మనసు చాలా మంచిది : ఏపీ మంత్రి రోజా

rk roja
అనారోగ్యం కారణంగా మృతి చెందిన సీనియర్ హీరో రెబెల్ స్టార్ కృష్ణంరాజు మృతిపై ఏపీ మంత్రి, సినీ నటి ఆర్.కె.రోజా స్పందించారు. ఆయన పేరుకే రెబెల్ స్టార్.. కానీ ఆయన మనస్సు చాలా మంచిదంటూ కితాబిచ్చారు. తాను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఎంతగానో ప్రోత్సహించారని చెప్పారు. 
 
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని కృష్ణంరాజు భౌతికకాయానికి ఆమె నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ, కృష్ణంరాజుతో కలిసి తాను ఒకే ఒక్క చిత్రంలోనే నటించానని, అయినప్పటికీ తాను ఎక్కడ కనిపించినా ఎంతో ఆప్యాయంగా పలుకరించేవారని చెప్పారు. 
 
సినీ పరిశ్రమలో ఎన్టీఆర్, అక్కినేని, కృష్ణంరాజు, శోభన్ బాబు తదితరులు పెద్ద దిక్కుగా ఉంటూ ఉండస్ట్రీని ఎలా ముందుకు నడిపించారో మనందరం కళ్లారా చూశారమని చెప్పారు. 
 
ముఖ్యంగా తాను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తనను ఎంతో ఎంకరేజ్ చేశారని చెప్పారు. ఈ రోజు ఆయన లేరనే వార్త విని చాలా బాధపడ్డారని చెప్పారు. ఆయన మరణం సినీ, రాజకీయ రంగాలకు తీరని లోటని చెప్పారు. ప్రకృతిని బలంగా నమ్మి, ప్రేమించిన వ్యక్తి అని చెప్పారు. 
 
అడిగిన వారందరికీ సాయం చేసే గొప్ప మనిషి అని కొనియాడారు. కృష్ణంరాజు కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని... ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. కృష్ణంరాజు భౌతికకాయానికి రోజా ఈరోజు నివాళి అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.