గురువారం, 12 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

సంగీత ప్రపంచానికి రెహ్మాన్ దూరం? స్పందించిన కుమార్తె - కుమారుడు!!

ar rehman
తన భార్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ సంగీత ప్రపంచానికి కొంతకాలం పాటు దూరంగా ఉండనున్నారనే ప్రచారం విస్తృతంగా సాగుతుంది. దీనిపై రెహ్మాన్ కుమార్తె ఖతీజా, కుమారుడు అమీన్ స్పందించారు. తన తండ్రి కెరీర్ విషయంలో జరుగుతున్న ప్రచారం అసత్యమని వారు స్పష్టం చేశారు. ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం దయచేసి మానుకోవాలంటూ ఇన్‌స్టా వేదికగా వారు పేర్కొన్నారు. 
 
ఈ విషయంపై ఇటీవలే తాను ట్విట్టర్‌లో వివరణ ఇచ్చానని, అయినా పుకార్లు ఆగడంలేదని వాపోయారు. ఈ సందర్భంగా తన తండ్రి విషయంలో నిరాధార వార్తలు, కథనాలు ప్రసారం చేయొద్దంటూ మరోసారి విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందినట్టు సంబంధిత వార్తను ప్రచురించిన ఓ మీడియాను కోట్ చేస్తూ ఖతీజా వివరణ ఇచ్చారు.
 
తన భర్తకు విడాకులు ఇస్తున్న రెహ్మాన భార్య సైరా బాను ప్రకటించారు. అదే రోజున రెహ్మాన్ బృందంలోని ఓ మహిళ కూడా తన భర్తతో విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. దీంతో రెహ్మాన్‌పై పలు ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. ఈ ప్రచారాన్ని సదరు మహిళ కొట్టిపారేశారు. ఆ తర్వాత రెహ్మాన్ తన కెరీర్‌లో కొంత బ్రేక్ తీసుకుంటున్నారని ప్రచారం జరిగింది. దీనిపై ఖతీజా, అమీన్‌లు తాజాగా వివరణ ఇచ్చారు