ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: శుక్రవారం, 8 సెప్టెంబరు 2017 (13:05 IST)

పేరు మార్చుకున్న అర్జున్ రెడ్డి...

అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు సినీపరిశ్రమలో ఒక వెలుగు వెలుగుతున్న హీరో విజయ్ దేవరకొండ. సినిమా విడుదల ముందు నుంచి వివాదాలే..వివాదాలే. సినిమా పోస్టర్లలో ముద్దు సీన్లు.. సినిమా మొత్తం జుగుప్సాకరం. కుటుంబ సభ్యులతో అస్సలు కలిసి చూడలేమని యువ ప్రేక్షకులే ఇ

అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు సినీపరిశ్రమలో ఒక వెలుగు వెలుగుతున్న హీరో విజయ్ దేవరకొండ. సినిమా విడుదల ముందు నుంచి వివాదాలే..వివాదాలే. సినిమా పోస్టర్లలో ముద్దు సీన్లు.. సినిమా మొత్తం జుగుప్సాకరం. కుటుంబ సభ్యులతో అస్సలు కలిసి చూడలేమని యువ ప్రేక్షకులే ఇంటర్వ్యూలు ఇచ్చేశారు. వివాదాలతోనే పబ్లిసిటీ తెచ్చుకుని చివరకు మంచి హిట్‌ను సాధించింది అర్జున్ రెడ్డి సినిమా. 
 
ఈ చిత్రంలో హీరోదే కీలక పాత్ర. సినిమా మొత్తం స్లోగా నడిచినా అక్కడక్కడ వచ్చే సీన్లు ప్రేక్షకులనే ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఎందుకంటే తెలుగు సినిమాలో ఇలాంటి సీన్లు గతంలో ఎప్పుడూ రాలేదు కాబట్టి. ఒకటి రెండు కాదు 20కి పైగా లిప్ టు లిప్ కిస్‌లతో హీరోయిన్‌ను తెగ వాడేస్తాడు హీరో. ఈ సీన్లో యువ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నట్లుంది. అందుకే ఇప్పటికీ సినిమా హౌస్‌ఫుల్లే. 
 
ఇక సినిమాలో నటించిన హీరో విజయ్ సాయి దేవరకొండకు మాత్రం తెగ క్రేజ్ వచ్చేసింది. ఎక్కడికి వెళ్ళినా అర్జున్.. అర్జున్ అంటూ అభిమానులు తెగ హడావిడి చేసేస్తున్నారు. అయితే కొంతమంది విజయ్ దేవరకొండ అని పిలుస్తున్నారట. తన పూర్తి పేరు విజయ్ సాయి దేవరకొండ అని చాలామందికి తెలియడం లేదట. విజయ్ దేవరకొండ అనే పిలుస్తున్నారట. టీవీ ఇంటర్వ్యూలు, ప్రముఖులు అందరూ అలానే పిలుస్తుండటంతో తన పేరును మార్చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చేశారట విజయ్. 
 
తాను చిన్నప్పుడు తన పేరును దేవరకొండ అని రాస్తే టీచర్ కొట్టేదని, ఇంత పెద్ద పేరేంటంటే కళాశాలలో హేళన చేసేవారని, కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో ఏ పేరయితే వచ్చిందో అదే పేరును కొనసాగించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారట. స్వయంగా ట్విట్టర్‌లో ట్వీట్ చేస్తూ నా పేరు విజయ్ దేవరకొండ అని పంపారట. విజయ్ పంపిన మెసేజ్‌కు లక్షలమంది అభిమానులు ఈ పేరే బాగుందని కితాబు కూడా ఇచ్చారట. కాబట్టి... అర్జున్ రెడ్డి పేరు ఇప్పుడు విజయ్ సాయి దేవరకొండ కాదు.. విజయ్ దేవరకొండ అన్నమాట.