ఆదివారం, 26 మార్చి 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated: మంగళవారం, 6 డిశెంబరు 2022 (14:19 IST)

వైరల్ అవుతున్న అస్మిత కామెంట్లు.. నన్ను వేధిస్తే.. అంతే సంగతులు

Ashmitha
Ashmitha
ప్రముఖ నటి అస్మిత చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. తనను ఎవరైనా చిన్నచూపు చూస్తే మాత్రం ఊరుకునే ప్రస్తక్తే లేదని అస్మిత స్పష్టం చేసింది. ఏదో తాను చూస్తే హంబుల్ గా వున్నాననుకుంటే పొరపాటేనని చెప్పింది. 
 
షూటింగ్ నుంచి బయటకు వచ్చిన సమయంలో ఇద్దరు వ్యక్తులు కారును ఆపి తాను యాక్సిడెంట్ చేశానని చెప్తూ డబ్బుల కోసం బెదిరించారని అస్మిత చెప్పింది. కానీ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు పారిపోయారని తెలిపింది. 
 
తనను ట్రబుల్ చేసేవాళ్ల ఫోటోలు, బైక్ నంబర్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశానని అస్మిత అంది. అంతేకాదు.. తనను వేధించిన వాళ్లను షీ టీమ్ పోలీసులు పట్టుకున్నారని చెప్పింది. తనకు పరిసరాలు శుభ్రంగా వుండాలని.. నీట్ గా లేకపోతే ఆ ప్రాంతంలో వుండబోనని తెలిపింది.