Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రి బాట‌లో ఏవిఎస్ ప్రదీప్

Written By డీవీ
Updated: గురువారం, 28 ఏప్రియల్ 2022 (16:14 IST)
AVS, AVS Pradeep
తెలుగు తెరపై చెరగని సంతకం చేసిన నటుల్లో "ఏవిఎస్" ఒకరు.  కెరీర్ దేదీప్యమానంగా వెలుగొందుతున్న తరుణంలో 2013లో అనారోగ్యంతో ఏవిఎస్ అర్ధాంతరంగా మృతి చెందారు.
 
 ఇప్పుడు ఏవిఎస్ తనయుడు ఏవిఎస్ ప్రదీప్ న‌టుడిగా రాబోతున్నారు. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న తన తండ్రి ఏవిఎస్ వారసత్వాన్ని కొనసాగించేందుకు తనను తాను తీర్చిదిద్దుకున్నారు. తన తండ్రి పేరు ఏవిఎస్.ను తన పేరు ముందు చేర్చుకుని  ఆయనలాగే పేరు తెచ్చుకుని ముందుకు సాగాలని కంకణం కట్టుకున్నారు.
 
బిజినెస్ మేనేజ్మెంట్ లో మాస్టర్స్ చేసిన ఏవిఎస్ ప్రదీప్ కొన్నాళ్ళు ఎయిర్టెల్ కలెక్షన్ ఏజెన్సీ నిర్వహించారు. సొంతంగా యాడ్ ఏజెన్సీ సైతం నడిపిన ఏవిఎస్ ప్రదీప్  పలు పేరొందిన సంస్థలకు యాడ్ ఫిల్మ్స్ చేసి, తన ప్రతిభను ఘనంగా నిరూపించుకున్నారు!!
     కరానా క్రైసిస్ టైమ్ లోనూ తన క్రియేటివిటీకి పదును పెట్టి... "యాక్టివ్ స్టూడియోస్" పేరిట యు ట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. అన్నాచెల్లెళ్లయిన తన ఇద్దరు చిన్నారులతో వందకు పైగా ఎపిసోడ్స్ చేసి మెప్పించారు!!
 
   "వైదేహి" పేరుతో ఓ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో రూపొందించి దర్శకుడిగానూ తన సత్తా చాటుకున్న ఏవిఎస్ ప్రదీప్.... "భళా చోర భళా - కాంట్రాక్ట్" అనే మరో రెండు చిత్రాలు సైతం తెరకెక్కించారు. వినూత్న కథాంశాలతో రూపొందిన ఈ రెండు చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ మూడు చిత్రాల్లోనూ నటుడిగా విభిన్న పాత్రలు పోషించిన ఏవిఎస్ ప్రదీప్... ఇకపై పూర్తి స్థాయిలో నటనపై దృష్టి సారించాలని కోరుకుంటున్నారు.

అన్నీ చూడండి

ఇది iPhone కోసం ఆత్మహత్య కాదు, వెనుక ఏదో వుంది...

ఆమె వల్ల పరువు పోతోంది.. చంపెయ్... : కుమార్తెను ప్రియుడితో హత్య చేయించిన తండ్రి

ఆంధ్రప్రదేశ్‌లో వర్చువల్ డాక్టర్ కన్సల్టేషన్లు, హోం హెల్త్ కేర్ సేవలను బలోపేతం చేసిన స్టార్ హెల్త్

కోట్లకు పడగలెత్తుతున్న యాచకులు, వీడియో చూడండి

మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి చేశాడు : కాకినాడ ఎస్పీ బిందు మాధవ్

అన్నీ చూడండి

విదేశాల్లోనూ సాధ్యం కాని చికిత్స.. హైదరాబాద్‌లో సుడాన్‌ రోగికి మళ్లీ నడక

న్యూమోనియా ఎదుటివారికి అంటుకుంటుందా?

నిమ్మకాయ టీ తాగుతున్నారా?

చెన్నై కావేరీ ఆస్పత్రిలో సమీకృత మూర్ఛ వ్యాధి సంకక్షణా కేంద్రం

దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు ఏమిటో తెలుసా?: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సూచనలు

తర్వాతి కథనం
Show comments