ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 10 ఏప్రియల్ 2021 (19:04 IST)

`అయ్యో అయ్య‌యో``అంటూ లిప్‌కిస్ ఇస్తున్న‌ పూజిత‌

poojita, goutam
కథానాయిక పూజిత పొన్నాడ త‌న ప్రియుడ్ని మురిపంగా ద‌గ్గ‌ర‌కు తీసుకుని చుంభిస్తున్న స‌న్నివేశం  `ఆకాశ వీధుల్లో`చిత్రంలోనిది. ఇందులో ప్ర‌ణ‌మ‌గీతం సిద్ద్ శ్రీ‌రామ్ ఆల‌పించారు. దీనిని ఈనెల 13న విడుద‌ల చేయ‌నున్నారు. ఇటీవ‌లే ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేశారు. ద‌ర్శ‌కుడు క్రిష్ చూసి లుక్ బాగుంద‌ని ప్ర‌శంసించాడు. అయితే పాట‌కు సంబంధించిన లుక్ మాత్రం యువ‌త‌ను గిలిగింత‌లు పెట్టేదిలా వుంటుందని చిత్ర యూనిట్ తెలియ‌జేస్తుంది.

2001లో ఇదే పేరుతో నాగార్జున, ర‌వినా న‌టించారు. సింగీతం శ్రీ‌నివాస‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇప్పుడు అదే పేరుతో వ‌స్తున్న ఈ సినిమాకు క‌థానాయ‌కుడు ద‌ర్శ‌కుడు కూడా గౌతమ్ కృష్ణ కావ‌డం విశేషం. ఈ సినిమా రెండున్నర ఏళ్ల కృషి,ఈ మూవీ కోసం మా టీమ్ అంతా చాలా కష్టపడ్డామ‌ని తెలిజేస్తున్నాడు. యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించిన‌ట్లు ద‌ర్శ‌కుడు తెలియ‌జేస్తున్నాడు. లిప్‌కిస్ కూడా సంద‌ర్భంగా వ‌స్తుంద‌న‌ని తెలియ‌జేస్తున్నాడు. మ‌రి తెర‌పై ఎలా వుంటుందో చూడాల్సిందే. ఈ చిత్రాన్ని జీ.కే.ఫిల్మ్.ఫ్యాక్టరీ మరియు మనోజ్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్లో మనోజ్ జే.డి. మరియు డి.జే. మణికంఠ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.