గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 1 ఏప్రియల్ 2021 (19:32 IST)

అబ్బే.. నా సినిమాలో లిప్ కిస్ సీన్లు లేవు.. వుంటే కనుక చెప్పండి.. విష్వక్ సేన్

తాను నటించిన సినిమాల్లో లిప్ కిస్‌లు ఎక్కువగా ఉన్నాయనంటూ ఓ నెటిజన్‌ ఇటీవల పోస్ట్‌ పెట్టడంతో హీరో విష్వక్ సేన్ స్పందించారు. తాను కథానాయకుడిగా నటించిన రెండు సినిమాల్లో లిప్‌లాక్స్‌ లేవని కథానాయకుడు విష్వక్‌సేన్‌ అన్నారు. ప్రస్తుతం 'పాగల్‌' సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న విష్వక్‌ తాజాగా ఇన్‌స్టా స్టోరీస్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. 
 
''వెళ్ళిపోమాకే', 'ఈ నగరానికి ఏమైంది' అనే రెండు సినిమాల్లో తాను నటించాను. ఆ సినిమాల్లో అధరచుంబనాల్లేవు. మీకు కనుక ఆ సినిమాల్లో అలాంటి సన్నివేశాలు కనిపిస్తే చెప్పండి' అని ఆయన పేర్కొన్నారు.
 
2017లో విడుదలైన 'వెళ్ళిపోమాకే'తో విష్వక్‌ నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. అనంతరం ఆయన నటించిన 'ఈ నగరానికి ఏమైంది' మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత విష్వక్‌కు యువతలో అభిమానం పెరిగింది. 
 
ఇటీవల వచ్చిన 'ఫలక్నామా దాస్‌', 'హిట్‌' సినీ ప్రియుల్ని అలరించాయి. నరేష్‌ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్న 'పాగల్‌'లో ఆయన ప్రస్తుతం నటిస్తున్నారు. విభిన్నమైన ప్రేమకథగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నివేదా పేతురాజ్‌, సిమ్రన్‌ చౌదరి, మేఘలేఖ కథానాయికలు. దిల్‌రాజు సమర్పిస్తున్నారు.