గురువారం, 12 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 31 మార్చి 2021 (18:40 IST)

లిప్ కిస్‌లా వద్దు వద్దు.. నివేదా పేతురాజ్ No-Kiss Policy

కోలీవుడ్ భామ నివేదా పేతురాజ్.. బ్రోచేవారెవరురా, చిత్రలహరి, అల వైకుంఠపురంలో చిత్రాలతో తెలుగులో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. తాజాగా రానా-సాయిపల్లవి కాంబోలో వస్తున్న విరాటపర్వంలో కీ రోల్ పోషిస్తుంది. చందూమొండేటి డైరెక్షన్‌లో ఓ సినిమాతోపాటు తమిళంలో రెండు ప్రాజెక్టులు చేస్తుంది. 
 
ఇక ఈ భామ గ్లామరస్ స్టిల్స్ చూస్తుంటే ఆన్‌స్క్రీన్‌పై బోల్డ్ సీన్లలో నటించేందుకు కూడా తాను సిద్దమేనని హింట్ ఇస్తోందని నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు. అయితే నివేదా మాత్రం స్క్రీన్‌పై రొమాంటిక్ సీన్ల విషయంలో హద్దులు పెట్టుకుందట.
 
తాజాగా ఈ బ్యూటీ విశ్వక్ సేన్‌తో పాగల్ సినిమాలో నటిస్తోంది. ఎప్పటిలాగే ఈ సినిమాకు నివేదా నో కిస్ పాలసీని మెయింటెయిన్ చేస్తుందట. విశ్వక్‌సేన్ ఇప్పటివరకు నటించిన సినిమాల్లో హీరోయిన్‌తో కిస్ సీన్లున్నాయి. కానీ పాగల్‌లో మాత్రం ఈ హీరో నివేదా పేతురాజ్‌ను కిస్ చేసే ఛాన్స్ మిస్సయినట్టు టాలీవుడ్ వర్గాల టాక్‌. నరేశ్ కొప్పిలి డైరెక్ట్ చేస్తున్న పాగల్ మే 1న విడుదల కానుంది.