1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 18 మార్చి 2021 (20:11 IST)

ఆ చిత్రంపై గంపెడాశలు పెట్టుకున్న నివేదా పేతురాజ్

టాలీవుడ్‌కు 'మెంటల్ మదిలో' అనే చిత్రం ద్వారా పరిచయమైన కేరళ కుట్టి నివేదా పేతురాజ్. ఈమె తన మొదటి సినిమాతో మంచి పేరే తెచ్చుకుంది. ఆ తర్వాత కూడా 'చిత్రలహరి' .. 'బ్రోచేవారెవరురా' .. 'అల  వైకుంఠపురములో' సినిమాల్లో నటించింది. 
 
ఇటీవల 'రెడ్' సినిమా కూడా ఈ బ్యూటీకి మంచి పేరే తెచ్చి పెట్టింది. కానీ సోలో హీరోయిన్ అవకాశాలు మాత్రం దక్కడం లేదు. కాగా తాజాగా 'పాగల్' అన్న సినిమాలో హీరోయిన్‌గా నటించింది. విశ్వక్ సేన్ హీరోగా నటించాడు. 
 
యూత్ ఆడియన్స్‌లో విశ్వక్ సేన్‌కి మంచి క్రేజ్ ఉంది. ఆక్రేజ్‌తో నివేదా 'పాగల్' సినిమాతో సోలో హీరోయిన్‌గా సెటిలవుతుందన్న నమ్మకంగా ఉందట. అభిమానులు కూడా నివేదాకి మంచి బ్రేక్ వచ్చి స్టార్ హీరోయిన్ అవ్వాలని కోరుకుంటున్నారు.