ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 8 ఆగస్టు 2017 (12:07 IST)

నేను బూతులు మాట్లాడేందుకు కమల్ హాసనే కారణం: బిగ్ బాస్ గాయత్రి

బిగ్ బాస్ తమిళ కార్యక్రమం రసవత్తరంగా సాగుతోంది. విజయ్ టీవీలో ప్రసారం అయ్యే ఈ ప్రోగ్రామ్ ద్వారా రేటింగ్ బాగా పెరిగిపోతుంది. ప్రేక్షకుల మధ్య భారీ ఆదరణకు నోచుకుంటున్న బిగ్ బాస్ షోలో పాల్గొన్న పార్టిసిపెం

బిగ్ బాస్ తమిళ కార్యక్రమం రసవత్తరంగా సాగుతోంది. విజయ్ టీవీలో ప్రసారం అయ్యే ఈ ప్రోగ్రామ్ ద్వారా రేటింగ్ బాగా పెరిగిపోతుంది. ప్రేక్షకుల మధ్య భారీ ఆదరణకు నోచుకుంటున్న బిగ్ బాస్ షోలో పాల్గొన్న పార్టిసిపెంట్ గాయత్రి.. హోస్ట్ కమల్ హాసన్‌‌పై వివాదాస్పద కామెంట్లు చేసింది. తాను బూతులు మాట్లాడానని ప్రజల్ని కమల్ హాసనే రెచ్చగొడుతున్నారని కొరియోగ్రాఫర్ అయిన గాయత్రి వెల్లడించింది.   
 
బిగ్ బాస్ ప్రారంభమైనప్పటి నుంచి సహ పార్టిసిపెంట్స్‌ను బూతులు తిడుతున్నట్లు గాయత్రిపై ఆరోపణలున్నాయి. ఓవియాపై గాయత్రి చేసిన ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు. గాయత్రి టార్చర్‌కు తట్టుకోలేక బిగ్ బాస్ హౌస్ నుంచి ఓవియా పారిపోయింది. పలుమార్లు ఓవియాను టార్గెట్ చేసిన గాయత్రి.. ఆమెను బూతులు తిట్టింది. పలుసార్లు బెదిరించింది. అంతేకాకుండా ఓవియాను హెయిర్ అనే బూతుపదంతోనూ తిట్టింది. ఇవన్నీ ప్రేక్షకులకు గాయత్రిపై కోపాన్ని తెప్పించాయి. అంతేకాకుండా గాయత్రి యవ్వారంపై కమల్ హాసన్ ఏమాత్రం స్పందించట్లేదని సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అయ్యారు. 
 
ఈ నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్ నుంచి ఓవియా వెళ్ళిపోవడానికి గాయత్రి అండ్ టీమ్ చేసిన టార్చరే కారణమని తెలిసింది. దీంతో కమల్ హాసన్ గత వారం ఎపిసోడ్‌లో పార్టిసిపెంట్స్‌ను ఒక్కొక్కరిని ప్రత్యేకంగా పలకరించారు. ఈ క్రమంలో గాయత్రి వద్ద విచారించిన కమల్.. బూతులు వాడటం ఏమిటని ఖండించారు. అయితే తాజా ఎపిసోడ్‌లో కమల్ హాసన్‌పై గాయత్రి ఆరోపణలు చేసింది. తాను బూతుపదాలు మాట్లాడుతున్నట్లు కమల్ హాసన్ ప్రజలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ఇంకా తనను మార్చే హక్కు కమల్ హాసన్‌కు లేదని గాయత్రి చెప్పింది. కమల్ హాసన్ అనవసరం తనకు కోపం తెప్పిస్తున్నారని గాయత్రి వెల్లడించింది. తనను మార్చే హక్కు తన అమ్మగారికి మాత్రమే వుందని చెప్పుకొచ్చింది.