ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 25 డిశెంబరు 2022 (13:23 IST)

చలపతిరావు అకాల మరణం కలిసివేసింది.. చిరంజీవి, బాలకృష్ణ

chiranjeevi
ప్రముఖ నటుడు చలపతిరావు అకాల మరణం తమ మనస్సులను కలిసివేసిందని టాలీవుడ్ అగ్రనటులు చిరంజీవి, బాలకృష్ణలు ఉన్నారు. చలపతిరావు మృతిపై తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తంచేసిన వారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రకటన చేశారు. 
 
చలపతిరావు పార్థివదేహానికి నివాళులు అర్పించిన తర్వాత చిరంజీవి స్పందిస్తూ, చలపతిరావు అకాల మరణం కలచివేసిందన్నారు. విలక్షణమైన నటుడిగా ఆయన అభివర్ణించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పేర్కొంటూ, ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 
 
అలాగే, హీరో బాలకృష్ణ స్పందిస్తూ, చలపతి రావు హఠాన్మరణం తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఆయన విలక్షణమైన నటనతో తెలుగు వారిని ఆలరించారు. నిర్మాతగా కూడా మంచి చిత్రాలు తీశారు. నాన్నగారితోకలిసి ఎన్నో సినిమాల్లో  నటించారు. నా సినిమాల్లోనూ చలపతిరావు నటించారు. ఆయన ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలి అని అన్నారు.