సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 25 డిశెంబరు 2022 (10:18 IST)

కోరుకున్నదానికంటే దేవుడు ఎక్కువే ఇచ్చాడు.. తిరిగి ఇవ్వాల్సింది చాలావుంది..

chiranjeevi
తాను కోరుకున్నదానికంటే దేవుడు చాలా ఎక్కువే ఇచ్చారని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. అందువల్ల సమాజానికి ఇవ్వాల్సింది చాలా ఉందని తెలిపారు. పైగా, ఇంతకాలం నాకేంటి, నా కుటుంబానికేంటి అని ఆలోచించానని కానీ, జీవితం అంటే అదికాదన్నారు. 
 
స్టార్ డమ్ కంటే వ్యక్తిగత జీవితమే ముఖ్యమని చిరంజీవి అన్నారు. దీనికి తగ్గట్టుగానే తన జీవితాన్ని మలుచుకునేందుకు ప్రతి రోజూ ప్రయత్నిస్తుంటానని చెప్పారు. ఇంతకాలం నాకేంటి.. నా కుటుంబానికేంటి అని ఆలోచించానని అది ఇక చాలన్నారు 
 
ఇపుడు తన కుటుంబ సభ్యులంతా అత్యున్నత స్థానంలో ఉన్నారని చెప్పారు. తాను కోరుకున్నదానికంటే భగవంతుడు ఎక్కువే ఇచ్చారని, ఇకపై తాను సమాజానికి తిరిగి ఇవ్వాలనుకుంటున్నానని చెప్పారు. 
 
సమాజానికి ఇప్పటివరకు తాను ఇచ్చింది చాలా తక్కువ అని, ఇవ్వాల్సింది చాలా ఉందని చెప్పారు. ముఖ్యంగా స్టార్ డమ్, గ్లామర్, కీర్తి శాశ్వతం కాదని మన వ్యక్తిత్వమే శాశ్వతమనే విషయాన్ని బలంగా నమ్ముతానని చెప్పారు.