ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 జులై 2020 (13:58 IST)

సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా బిగ్ బాస్.. ఫామ్ హౌజ్‌లోనే సెట్..!

బుల్లితెరపై బిగ్ బాస్‌కు బంపర్ క్రేజ్ వుంది. ఉత్తరాది నుంచి దక్షిణాది పాకిన ఈ షోకు మంచి క్రేజ్ వస్తోంది. మొదట్లో హిందీలో ప్రసారమయ్యే ఈ రియాల్టీ షో ప్రస్తుతం దాదాపు అన్ని ప్రాంతీయ భాషల్లో రూపొందుతోంది. అయినప్పటికీ హిందీ బిగ్ బాస్‌కి ఉన్న ప్రత్యేకతే వేరు. దీనికి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు.
 
అయితే కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ ఏడాది జరగాల్సిన 14వ సీజన్ ఆలస్యం కానుంది. తాజాగా దీని కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. ముంబైలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉండటంతో బిగ్ బాస్ సెట్‌ను పన్వేల్‌లో ఉన్న సల్మాన్ ఖాన్ ఫామ్ హౌజ్‌లో ఏర్పాటు చేస్తున్నారు. 
 
ఈ షో మొత్తం 100 రోజులు నడుస్తుంది. కరోనా వైరస్ కారణంగా సల్మాన్ ఖాన్ గత కొన్ని నెలలుగా ఈ ఫాం హౌజ్‌లోనే ఉంటున్నాడు. ఇందులోని వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయం చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.