సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (15:57 IST)

బిగ్ బాస్ ఫ్యామిలీ ఎమోషన్ టాస్క్.. మాధవీ లత రివ్యూ

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఎప్పుడూ ముందుండే మాధవీలత.. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్-2పై కామెంట్స్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ హౌస్‌లో జరిగిన ఫ్యామి

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఎప్పుడూ ముందుండే మాధవీలత.. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్-2పై కామెంట్స్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ హౌస్‌లో జరిగిన ఫ్యామిలీ ఎమోషనల్ టాస్క్‌కి మాధవీ లత రివ్యూ ఇచ్చింది. ఒక్కొక్కరికి ఆ టాస్క్‌లో రేటింగులు కూడా ఇచ్చింది.
 
అందరికంటే కౌశల్ తన పిల్లలను హత్తుకునే దృశ్యాలు తన మనసుని కదిలించాయని, సినిమా స్టైల్‌లో ఎడిట్ చేసి చూపించారని మాధవీలత వెల్లడించింది. అలాగే సామ్రాట్‌పై మాధవీలత కామెంట్స్ చేసింది. కోర్టు పని మీద సామ్రాట్ రెండుసార్లు బయటికి వెళ్లాడు. అప్పుడు తన అమ్మని కలవలేదా? ఒకే నెలలో రెండుసార్లు ఫ్యామిలీ కేసు మీద వెళ్తే కుటుంబ సభ్యులను కలవడా అంటూ అడిగింది. ''బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చిన సామ్రాట్ తల్లి ఎంతకాలం అయింది నిన్ను చూసి, నువ్వు స్ట్రాంగ్ అనుకోలేదు అనడం ఏంటి..? ఏమో నాకు డౌటే అంటూ'' కామెంట్స్ చేసింది.
 
ఇక తనీష్‌ని టార్గెట్ చేస్తూ.. తనీష్ తనకు నచ్చడని, అతని ఆలోచన విధానం తప్పు అని తెలిపింది. కౌశల్ పాపని చూసినప్పుడు మాత్రం మీ పాప చాలా క్యూట్‌గా ఉంది. మనిద్దరి మధ్య ఏమున్నా.. పాప కోసం మాత్రం ఇంటికి వస్తానని చెప్పాడు. ఇక తనీష్ తమ్ముడు మాత్రం తన అన్నకి శత్రువైన కౌశల్ తనకు కూడా శత్రువు అన్నట్లుగా ప్రవర్తించాడని మాధవీ లత సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.