శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 13 అక్టోబరు 2018 (16:26 IST)

బిగ్‌బాస్‌ ప్రైజ్‌మనీ రూ.50 లక్షలు అందుకే ఇచ్చేశా- కౌశల్

ప్రముఖ రియాల్టీ షో బిగ్‌బాస్‌-2లో విజేతనయ్యేందుకు తాను డబ్బులు వెదజల్లాననే పుకార్లు రావడం దురదృష్టకరమని బిగ్‌బాస్‌-2 విజేత కౌశల్‌ చెప్పారు.

ప్రముఖ రియాల్టీ షో బిగ్‌బాస్‌-2లో విజేతనయ్యేందుకు తాను డబ్బులు వెదజల్లాననే పుకార్లు రావడం దురదృష్టకరమని బిగ్‌బాస్‌-2 విజేత కౌశల్‌ చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో కౌశల్ మాట్లాడుతూ.. బిగ్‌బాస్ హౌస్‌లో వెళ్లేందుకు కొన్ని రోజుల ముందు కౌశల్ ఆర్మీని ఫామ్ చేసుకున్నారనే మాటలను కౌశల్ ఖండించాడు. తాను అంత డబ్బున్నవాడినే అయితే అద్దె ఇంట్లో ఉండేవాడిని కాదు గదా.. అంటూ ప్రశ్నించాడు. 
 
నెలకి ఇరవై వేలు అద్దె కడతాను. కారుకు లోన్ కట్టుకోవాలి. తనకు నిజంగా డబ్బు వుంటే యాభై లక్షల కోసం ఇంతమందితో ఇన్నిరకాలుగా మాటలు పడతానా అంటూ అడిగాడు. డబ్బులున్న వాళ్లకి యాటిట్యూడ్ వుంటుంది. ఆ యాటిట్యూడ్ వున్నవాళ్లు అవతల వాళ్లు ఒక్కమాట అన్నా పడరు. తనను అంత మాట అంటారా.. తలుపులు తీసేయండి అంటూ బయటికి వెళ్లిపోతారు. 
 
కానీ తాను అలా చేయలేదు. తనకు మదర్ సెంటిమెంట్ చాలా ఎక్కువ. తన తల్లి కేన్సర్‌తో బాధపడుతూ చనిపోయింది. అలా మిగతా వాళ్ల తల్లులు ఆర్థికంగా బాధపడకూడదనే తనకు వచ్చిన ప్రైజ్ మనీ అంతా కూడా ఇచ్చేశాను. తన తల్లి రుణం తీర్చుకోవడానికే అలా చేశానని చెప్పుకొచ్చాడు.
 
మరోవైపు కౌశల్‌ ఆర్మీని మరింత విస్తరిస్తానని కౌశల్ తెలిపాడు. విజయవాడ, బెంగుళూరు వంటి నగరాలలో పర్యటించి కౌశల్‌ ఆర్మీ సభ్యులను కలుస్తానన్నారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తానన్నారు. తన అభిమానులంతా కౌశల్‌ ఆర్మీ పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా వుందని తెలిపారు. 
 
కౌశల్‌ఆర్మీ తరపున రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు, అనాథలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. తన తల్లి క్యాన్సర్‌తో పడిన బాధ వర్ణణాతీతమన్నారు. బిగ్‌బాస్‌ ప్రైజ్‌మనీ రూ.50 లక్షలతోపాటు క్యాన్సర్‌ రోగుల వైద్యానికి తన సొంత నిధులు కూడా ఖర్చు చేస్తానని కౌశల్‌ వెల్లడించారు.