కన్నడ బిగ్‌బాస్ సెలబ్రిటీ ఆత్మహత్యాయత్నం.. పెళ్లైన కొద్ది రోజులకే..?
ప్రముఖ రచయిత్రి, కన్నడ బిగ్‌బాస్ సెలబ్రిటీ చైత్ర కోటూర్ ఆత్మహత్యాయత్నాం చేశారు. ఈ ఘటన శాండల్ఉడ్ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. గురువారం రోజు బెంగళూరులోని తన నివాసంలో ఆమె ఆత్మహత్యాయత్నం చేశారు. బిగ్‌బాస్‌తో మంచి ప్రేక్షకాదరణను మూటగట్టుకొని రచయిత్రిగా రాణిస్తున్న చైత్ర కోటూర్ మార్చి 28 నాగార్జున్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది.
పెళ్లైన కొద్ది రోజులకే ఆమె ఆత్మహత్యాయత్నం చేయడం పటు అనుమానాలకు దారితీస్తుంది. చైత్ర ఆత్మహత్యాయత్నాం ఆమె కుటుంబ సభ్యులు ధృవీకరించారు. అయితే ఈ ఘటనపై మాత్రం చైత్ర కుటుంబ సభ్యులు, సన్నిహితులు పెదవి విప్పకపోవడంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సూసైడ్ ప్రయత్నం తర్వాత హాస్పిటల్‌లో చేరిన చైత్ర ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సూసైడ్‌కు గల కారణాలు తెలియాల్సి ఉంది.