బుడతడుకి సిగరెట్ తాగడం నేర్పించిన ప్రభుత్వ వైద్యుడు... ఎక్కడ?
కొందరు విద్యావంతులు కొన్ని సమయాల్లో విచక్షణ మరిచిపోయి తాము ఏం చేస్తున్నామో వారికే తెలియదు. అలాంటి సమయాల్లో వారు చేసే పనులు సభ్యసమాజం తలదించుకునేలా ఉంటాయి. తాజాగా ఓ ప్రభుత్వ వైద్యుడు చేసిన పనిపై ప్రభుత్వం కన్నెర్రజేసింది. దీంతో ఆ వైద్యుడుపై సస్పెండ్ వేటు వేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం జాలౌన్ జిల్లా కుఠౌంద్ ప్రాథమిక వైద్య కేంద్రంలో పని చేసే వైద్యుడు ఒకటి ఓ బాలుడుకు సిగరెట్ తాగడం నేర్పించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఆయనపై పోలీసులు ఫిర్యాదు చేశారు. అలాగే, ఆయనపై బదిలీ వేటు కూడా వేసింది.
అదే పీహెచ్‍సీలో పని చేసే నర్సు కుమారుడైన ఓ బాలుడు జలుబుకు చికిత్స కోసం వైద్యుు వద్దకు రాగా, ఆయన సిగరెట్ తాగడం నేర్పించాడు. పిల్లాడి నోట్లో సిగరెట్ పెట్టి స్వయంగా తానే వెలిగించడమే కాకుండా, పీల్చు.. పీల్చు అంటూ ప్రోత్సహించాడు. ఈ విషయం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో ఆఖరులో బాస్.. ఈ రోజుకు ఈ శిక్షణ చాలు.. రేపు రా.. మళ్లీ నేర్పుతా అంటున్న డాక్టర్ సురేశ్ చంద్ర గొంతు కూడా అందులో రికార్డు అయింది.