శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 జనవరి 2021 (09:50 IST)

తమిళ బిగ్ బాగ్ 4వ సీజన్ విజేత ఆరి అర్జున

తమిళ బిగ్ బాస్ నాలుగో సీజన్ ముగిసింది. ఈ సీజన్ విజేతగా ఆరి అర్జున నిలిచారు. దాదాపు 105 రోజులుగా తమిళ బుల్లి తెర వీక్షకులను ఎంతగానో ఈ షో ఆలరించింది. ఆదివారం రాత్రి జరిగిన గ్రాండ్ ఫినాలేలో నటుడు ఆరి అర్జున విజయం సాధించినట్టు హోస్ట్ కమల్ హాసన్ ప్రకటించారు. 
 
ఆపై బిగ్ బాస్ ట్రోఫీని, రూ.50 లక్షల నగదు బహుమతిని కమల్ అందించారు. ఈ సీజన్‌లో ఆరి అర్జునతో పాటు బాలాజీ మురుగదాస్, రమ్యా పాండ్యన్, సోమ్ శేఖర్, రియో రాజ్‌లు టాప్ - 5 ఫైనలిస్టులుగా నిలిచారు. 
 
కాగా, ఆది నుంచి అత్యధిక వీక్షకుల ఓట్లు ఆరి అర్జునకే వస్తుండటంతో, విజేతగా అతనే నిలుస్తాడని ముందు నుంచే ఊహాగానాలు ఉన్నాయి. హౌస్‌లోకి వెళ్లినప్పటి నుంచి ప్రేక్షకుల మన్ననలను అందుకుంటూ, దాదాపు మూడున్నర నెలల పాటు అర్జున అందరినీ అలరించాడని గ్రాండ్ ఫినాలేలో కమల్ హాసన్ వ్యాఖ్యానించారు. 
 
ముఖ్యంగా, ఆరి అర్జున నిజాయితీ, పోరాట పటిమ తనను ఎంతగానో ఆకర్షించాయని చెప్పారు. కాగా, హౌస్‌లో అత్యధిక సార్లు ఎలిమినేషన్‌కు నామినేట్ అయిన కంటెస్టెంట్‌గా ఉన్న అర్జున ప్రతిసారీ, ఫ్యాన్స్ ఓట్లతోనే గట్టెక్కుతూ వచ్చి.. చివరకు గ్రాండ్ ఫినాలేలో విజేతగా నిలిచి రికార్డు సృష్టించాడు.