శనివారం, 30 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 అక్టోబరు 2021 (13:39 IST)

Bigg Boss telugu 5: పేడలో ముత్యాలు.. ష‌ణ్ముఖ్ విన్.. టాస్క్‌లతో బిజీ బిజీ

బిగ్ బాస్ సీజన్ 5 ప్రతీ రోజూ ఆసక్తికరంగా సాగుతోంది. బిగ్ బాస్ ఇచ్చే చిన్న ట్విస్ట్‌ల‌తో గేమ్ ఇంకా ర‌స‌వ‌త్తంగా సాగుతుంది. ఇక సోమవారం నాటి నామినేషన్స్ చాలా ఎమోషనల్‌‌గా సాగాయి. లోబో, సిరి, మానస్, రవి, షణ్ముఖ్, శ్రీరామ్ ఈ ఆరుగురు నామినేట్ అయ్యారు.

ఇక మంగళవారం నాటి 52వ ఎపిసోడ్ హైలైట్స్ విషయానికి వస్తే.. ఈ సారి కెప్టెన్సీ టాస్క్ కూడా నెవ్వర్ బిఫోర్ అనేలా చాలా ఇంట్రెస్టీగా సాగింది. ఈ టాస్క్ లో గెలిస్తే.. నామినేష‌న్ నుంచి త‌ప్పించుకోవ‌చ్చున‌ని స్ట్రాంగ్ ఫిక్స్ అయ్యారు కంటెస్టెంట్లు . దీంతో అస‌లు త‌గ్గేదే లేద‌న‌ట్టు ఆట‌ను ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగించారు.
 
కెప్టెన్సీ టాక్స్‌లో భాగంగా మొద‌ట‌గా అభ‌య‌హ‌స్తం అనే టాస్క్ ఇవ్వ‌గా, ఇందులో హౌస్ మొత్తం లాక్ డౌన్‌లోనే ఉంటుందని.. ఇంటి సభ్యులంతా గార్డెన్ ఏరియాలోనే ఉంటారని చెప్పారు. కెప్టెన్సీ కంటెస్టెంట్‌గా సెలెక్ట్ అయిన వారే ఇంట్లోకి వెళ్ళాలి అనే కండిషన్ కూడా పెట్టారు. దీంతో ఎలాగైనా ఈ సారి కెప్టెన్ గా సెలెక్ట్ కావాల‌ని లోబో, షణ్ముఖ్ లు కష్ట పడేందుకు సిద్ధమయ్యారు.
 
ఇంటి స‌భ్యులు లోప‌లికి వెళ్లాలంటే .. ప్ర‌తి కెప్టెన్సీ కంటెస్టెంట్ ఐదు ఛాలెంజ్‌లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. టాస్కులో గెలిచి కెప్టెన్సీ కంటెస్టెంట్ మాత్ర‌మే ఇంట్లోకి వెళ్తారు. అయితే ఎవ‌రు పోటీప‌డ‌తారు అనేది ఏకాభిప్రాయంతో బిగ్ బాస్‌కి తెల‌పాల్సి ఉంటుంది. అలాగే మొదటి ఛాలెంజ్‌లో ఓడిపోయిన సభ్యులు రెండో ఛాలెంజ్‌లో పాల్గొనే అవకాశం ఉండ‌దని తేల్చి చెప్పారు బిగ్ బాస్.
 
ఇక మొద‌టి ఛాలెంజ్‌కి లోబో, ష‌ణ్ముఖ్ సిద్ధం అయ్యారు. ఈ టాస్క్‌లో టబ్‌లో పేడతో క‌లిపిన మట్టిలో కొన్ని ముత్యాలను ఉంచారు. ఆ ముత్యాలను వెతికిపట్టుకోవాలి. ఎవరు ఎక్కువ ముత్యాలను వెతికి తీస్తారో వారు ఈ టాస్క్‌లో విజేతలు అవుతారని చెప్పారు. 
 
టాస్క్ కోసం లోబో, ష‌ణ్ముఖ్ తీవ్రంగా శ్ర‌మించారు. ఆ పేడ‌లో ఇష్ట‌మొచ్చిన‌ట్టు బోరారు. పేడ వాస‌న భరించారు. ఫైన‌ల్‌గా షన్నూ 101 ముత్యాలను, లోబో(74)ల‌ను వెతికి తీశారు. అయితే ష‌ణ్ముఖ్ ముత్యాలు నీట్‌గా లేవ‌న్నారు. ఇక్క‌డ స‌మ‌స్య నీట్‌గా ఉన్నాయ లేవా ? అనేది మ్యాటర్ కాదు.. ఎక్కువ తీయాలంతే అని మెయిన్ అని చెప్పుకొచ్చింది. ఎట్ట‌కేల‌కు ష‌ణ్ముఖ్ విజ‌యం సాధించ‌డంతో ఆయ‌న‌కు టైట్ హ‌గ్ ఇచ్చింది సిరి.
 
విశ్వ కెప్టెన్సీ టాస్క్ పోటీ నుండి స్వచ్ఛందంగా తప్పుకున్నాడు. దాంతో రెండో గేమ్‌లో పాల్గొనే ఛాన్స్ రవి, సిరిల‌కు ద‌క్కింది. వీరికి ‘గాలం మార్చే మీ కాలం’ అనే ఈ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్ లో భాగంగా స్విమ్మింగ్ పూల్ లోని బాటిల్స్ ను గాలం సాయంతో బయటకు తీసే పని ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్‌లో ర‌వి 12 బాటిల్స్ తీయగా.. సిరి 15 బాటిల్స్ పైకి తీసి విజేతగా నిలిచింది.
 
ఇక మూడో ఆటలో మాన‌స్, సింగర్ శ్రీ‌రామ్‌లు పోటీ ప‌డ్డారు. వీరికి ‘తాడుల తకథిమి’ అనే గేమ్ పెట్టారు. ఈ టాస్క్‌లో నాన్ స్టాప్‌గా రోప్స్ ను స్వింగ్ చేయించాల్సి ఉంటుంది. పోటాపోటీగా జరిగిన ఈ టాస్క్ లో మానస్ అలిసి పోయి చివరి క్షణంలో గేమ్ నుండి డ్రాప్ అయ్యాడు.

దాంతో కెప్టెన్సీ టాస్క్ లో పాల్గొనే ఛాన్స్ తో పాటు హౌస్ లోకి శ్రీరామ్ కు ఎంట్రీ లభించింది. నిన్న జ‌రిగిన‌ మూడు టాస్క్ లలో షణ్ణు, సిరి, శ్రీరామ్ విజేతలుగా నిలిచి, బిగ్ బాస్ ఇంటిలోకి ఏంట్రీ అయ్యారు. ఇక రెండు టాస్కులు మిగిలి ఉన్నాయి.. దీంతో ఎవ‌రూ కెప్టెన్ కానున్న‌ర‌నే ఉత్కంఠ నెల‌కొంది.
 
అలాగే.. ఈ వారం నామినేషన్స్ నిచిలిన మగవాళ్ళే ఖ‌చ్చితంగా ఎలిమినేట్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే.. నామినేషన్స్ లో ఐదుగురు అబ్బాయిలు ఉండగా, అమ్మాయి కేవలం సిరి మాత్రమే! ఆమెకు ఓటర్ల నుండి మంచి సపోర్ట్ ఉంది. దీంతో ఈసారి లోబో ఎలిమినేట్ కావచ్చనే పుకార్లు షికారు చేస్తున్నారు.