బుధవారం, 19 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 18 ఫిబ్రవరి 2025 (20:44 IST)

మహిళల్లో క్యాన్సర్.. అందుబాటులోకి ఆరు నెలల్లో వ్యాక్సిన్-ప్రతాప్ రావ్ జాదవ్

Cancer Vaccine
Cancer Vaccine
మహిళలను ప్రభావితం చేసే క్యాన్సర్‌ను ఎదుర్కోవడానికి వచ్చే ఐదు నుండి ఆరు నెలల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రరావు జాదవ్ ప్రకటించారు. 9 నుంచి 16 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికలు మాత్రమే ఈ టీకా తీసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు.
 
దీనిపై మీడియాతో మాట్లాడిన ప్రతాప్రరావు జాదవ్, టీకాపై పరిశోధనలు దాదాపు పూర్తయ్యే దశలో ఉన్నాయని, ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని అన్నారు. దేశంలో పెరుగుతున్న క్యాన్సర్ కేసుల సంఖ్యను ప్రస్తావించారు. ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
 
 ముందస్తు గుర్తింపు ప్రయత్నాలలో భాగంగా 30 ఏళ్లు పైబడిన మహిళలకు ఆసుపత్రులలో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. 
 
క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే మందులపై కస్టమ్స్ సుంకాన్ని కూడా రద్దు చేసినట్లు మంత్రి ప్రకటించారు. రాబోయే వ్యాక్సిన్ రొమ్ము, నోటి, గర్భాశయ క్యాన్సర్‌లను నియంత్రించడంలో సహాయపడుతుందని నొక్కి తెలిపారు.