బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 23 అక్టోబరు 2017 (10:16 IST)

కేసీఆర్ బయోపిక్‌కు వేళాయె.. కేసీఆర్ పాత్రకు నవాజుద్దీన్ సిద్ధిఖీ?

తెలంగాణ సీఎం కేసీఆర్ జీవిత కథ ఆధారంగా సినిమా రూపుదిద్దుకోనుంది. ఈ సినిమాకు కావాల్సిన హంగులన్నీ కేసీఆర్ జీవితంలో ఉండటంతో.. బయోపిక్ తీసేందుకు నిర్మాతలు, దర్శకులు సిద్ధమవుతున్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ జీవిత కథ ఆధారంగా సినిమా రూపుదిద్దుకోనుంది. ఈ సినిమాకు కావాల్సిన హంగులన్నీ కేసీఆర్ జీవితంలో ఉండటంతో.. బయోపిక్ తీసేందుకు నిర్మాతలు, దర్శకులు సిద్ధమవుతున్నారు.

ఉద్యమం, రాజకీయాలు, ఉపవాస దీక్షలు, ప్రజాభిమానం, అనుకున్నది సాధించిన ధీరత్వం వీటన్నింటిని ఇతివృత్తంగా తీసుకుని కేసీఆర్ బయోపిక్ రూపుదిద్దుకోనుంది. ఈ నేపథ్యంలో దర్శకనిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి, కథను సిద్ధం చేసుకోవడంతో పాటు హీరోను కూడా సెలక్ట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. 
 
కేసీఆర్ పాత్రకు హిందీ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీని కూడా ఎంపిక చేసినట్లు సమాచారం. శ్రీధర్‌తో ఆయన సంప్రదింపులు జరిపారని టాక్. మరోవైపు శ్రీధర్‌తో పాటు దర్శకుడు లక్ష్మణ్ (బందూక్ ఫేమ్) కూడా కేసీఆర్‌పై ఓ సినిమాకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.

అన్నీ అనుకున్నట్టు జరిగితే అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే కేసీఆర్ బయోపిక్ తెరపైకి వచ్చే ఛాన్సున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.