ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 20 అక్టోబరు 2017 (14:54 IST)

ఆ హీరో అడిగితే కాదనలేనంటోన్న టబు, ప్రేమించినందుకేనట...

టబు పేరు చెప్పగానే నాగార్జునతో నటించిన నిన్నే పెళ్లాడుతా చిత్రం గుర్తుకు వస్తుంది. ఆ చిత్రంలో వీరి మధ్య రొమాన్స్ అదిరిపాటుగా వుంటుంది. ఆ దెబ్బతో వాళ్లిద్దరి మధ్య లింకు పెట్టేశారు చాలామంది. కానీ నిజానికి టబు ప్రేమించిందీ, వివాహం చేసుకోవాలనుకున్నది బాల

టబు పేరు చెప్పగానే నాగార్జునతో నటించిన నిన్నే పెళ్లాడుతా చిత్రం గుర్తుకు వస్తుంది. ఆ చిత్రంలో వీరి మధ్య రొమాన్స్ అదిరిపాటుగా వుంటుంది. ఆ దెబ్బతో వాళ్లిద్దరి మధ్య లింకు పెట్టేశారు చాలామంది. కానీ నిజానికి టబు ప్రేమించిందీ, వివాహం చేసుకోవాలనుకున్నది బాలీవుడ్ హీరోనేనట. అతనెవరో కాదు.. అజయ్ దేవగణ్. అతడు కాస్తా మరో హీరోయిన్‌ను పెళ్లాడటంతో ఇక టబు పెళ్లి చేసుకోకుండా అలాగే వుండిపోయింది. 
 
ఇటీవల మీరు పెళ్లెప్పుడు చేసుకుంటారని మీడియా అడిగితే.... తనకు తగిన వరుడిని మీరు చూసి పెడితే వెంటనే పెళ్లాడతానంటూ మీడియాకే రివర్స్ ఎటాక్ ఇచ్చింది. అంతమాటన్నాక మళ్లీ మీడియా టబును పెళ్లి గురించి అడుగుతుందా...? 
 
అదలావుంటే తాజాగా అక్కినేని అఖిల్ నటిస్తున్న చిత్రంలో అతడి తల్లి పాత్రలో టబు నటిస్తోంది. ఇంకా అజయ్ దేవగణ్ నటిస్తున్న మరో చిత్రంలో కూడా ఆఫర్ వచ్చినట్లు చెపుతోంది. అసలు అజయ్ దేవగణ్ తనకు ఎంత చిన్న పాత్ర ఇచ్చినా వదిలే ప్రసక్తే లేదనీ, తకు అజయ్ అంటే అంత ఇష్టమంటూ చెప్పుకొచ్చింది.