సోమవారం, 4 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 నవంబరు 2022 (13:44 IST)

రెండోసారి తాతయ్య అయిన బ్రహ్మానందం

ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం రెండో సారి తాత అయ్యారు. బ్రహ్మానందం తనయుడు, నటుడు రాజాగౌతమ్ సతీమణి పండంటి ఆడశిశువుకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని గౌతమ్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. 
 
ఈ ఫోటోలో గౌతమ్‌ తనయుడు తన సోదరిని ప్రేమగా చూస్తూ కనిపించాడు. దీన్ని చూసిన అభిమానులు, నెటిజన్లు, పలువురు సినీ ప్రముఖులు గౌతమ్‌కు అభినందనలు తెలిపారు. పల్లకిలో పెళ్లికూతురు సినిమాతో గౌతమ్ తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.