ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 8 నవంబరు 2022 (22:31 IST)

బ్రహ్మానందంతో ఉల్లాసంగా గడిపిన నీహారిక (video)

Brahmanandam, Niharika
Brahmanandam, Niharika
మెగాబ్రదర్ నాగబాబు కూతురు నీహారిక స్ఫురద్రూపి. ఎదుటి వారీతో సరదాగా ఉంటుంది. ఇక హాస్య నటుడు బ్రహ్మానందం కలిస్తే మరింత జోష్ ఉంటుంది. మంగళవారం ఓ పనిమీద బ్రహ్మానందం ఇంటికీ నీహారిక వెళ్ళింది. ఆమె రాకతో ఫామిలీ మెంబెర్ వచ్చినంత ఫీల్ అయినా బ్రహ్మీ ఆమెతో పలు విషయాలు మాట్లాడాడు. బ్రహ్మానందం ఆర్టిస్ట్. కూడా. బొమ్మలు బాగా డ్రాయింగ్ చేస్తారు. అందులో కొన్ని ఆమెకు చూపించి ఆమెను ఇన్స్పైర్ కలిగించాడు.
 
ఇక తన తాజా సినిమా రంగమార్తాండ గురుంచి ఆమెతో మాట్లాడుతూ కృష్ణ వంశి మరో గొప్ప సినిమా తీసాడని అన్నారు. ఇటీవలి రంగమార్తాండ కోసం బ్రహ్మానందం దుబ్బింగ్ చెప్పారు. ఇది తెలుగు సినిమా చరిత్రలో ఒక కొత్త ఒరవడి తెస్తుందని తెలిపారు. ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ తదితరులు ఇందులో నటించారు. నీహారిక వెబ్ సీరియల్ నిర్మాతగా బిజీగా ఉంది. త్యరలో ఆమె చేయబోయే సిరీస్ లో బ్రహ్మానందం నటించనున్నాడు.