గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 21 నవంబరు 2022 (14:55 IST)

గెటప్‌ శ్రీనును ఇకనుంచి ఫంక్షన్‌కు పిలవరా!

Getup Srinu
Getup Srinu
ఏ సినిమాకైనా సినిమా వేడుక జరిగితే చిత్రంలో పనిచేసిన నటీనటులు, టెక్నీషియన్లను పిలుస్తుంటారు. ఆ కోవలో హాస్య నటీనటులను కూడా పిలుస్తుంటారు. ఒకప్పుడు నటుడు బ్రహ్మానందంను అలాంటి వేడుకలకు పిలిస్తే వచ్చిన ఆడియన్స్‌ కానీయండి, ఫ్యాన్స్‌ కానీ స్టేజీపైన ఏ హీరో వున్నా సరే పట్టించుకొనేవారు కాదు. పరిచయ వాఖ్యాలలో బ్రహ్మానందం పేరు చెబితేనేచాలు అక్కడివారంతా హాహా కారాలుచేస్తూ ఆనందాన్ని అనుభవించేవారు. రానురాను ట్రెండ్‌ మారింది. ఇప్పుడు టీవీల్లో బజర్‌దస్త్‌ షోలో పాపులర్‌ అయిన వారెవరైనా వస్తేచాలు అలాంటి అనుభవాలే ఎదురవుతున్నాయి.
 
సోమవారంనాడు బజర్‌దస్త్‌ షో నటుడు గెటప్‌ శ్రీనుకు ఎదురయింది. ఈరోజు హనుమాన్‌ అనే పాన్‌ ఇండియా మూవీ టీజర్‌ హైదరాబాద్‌లో ఎ.ఎం.బి.మాల్‌లో జరిగింది. టీజర్‌ మొదటినుంచి యాంకర్‌ పరిచయం చేస్తున్న నటీనటుల పేర్లు చదివినప్పుడల్లా హీరో, దర్శకుడు కన్నా గెటప్‌ శ్రీను పేరు చెప్పగానే హాలంగా హోరెత్తిందింది. అలా ఏదో కొద్దిసేపు అనుకుంటే పొరపాటే. అలా దాదాపు నాలుగు సార్లు ఎక్కువసేపు అరుపులు కేకలు విజుల్స్‌ వేయడంతో ఒకరకంగా అది చూసి ఆనందంతో సిగ్గుపడుతూ వారికి గెటప్‌ శ్రీను నమస్కారాలు చేసినా ఆడియన్స్‌ తగ్గలేదు. ఆఖరికి యాంకర్‌ కలుగజేసుకుని ఇకనుంచి సినిమా ఫంక్షన్లకు గెటప్‌ శ్రీనును పిలిస్తే కష్టమే. ఆయన లేకుండా ఫంక్షన్‌లు చేసుకోవాలని అనేసింది. దానికి జీ హుజూర్‌ అంటూ మర్యాదపూర్వకంగా గెటప్‌ శ్రీను స్పందించారు. సో. టీవీ నటుడిని ఇంతగా ఓన్‌ చేసుకున్న తెలుగు ప్రేక్షకులకు తానేమిచ్చి రుణం తీర్చుకోగలడు.