ఆదివారం, 14 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 9 నవంబరు 2022 (19:05 IST)

గవర్నర్ తమిళిసై ను ఆహ్యానించిన అలీ

Tamilisai, Ali
Tamilisai, Ali
టాలీవుడ్‌ ప్రముఖ నటుడు అలీ తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్ ని కలిశారు. ఈ మధ్యే అలీని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎలక్ట్రానిక్‌ మీడియా ముఖ్య సలహాదారుగా నియమించిన సంగతి తెలిసిందే. అలీ నేడు తెలంగాణ గవర్నర్‌  తమిళిసై గౌరవప్రదంగా కలిసి ముచ్చటించారు. అలీ పెద్దకూతురు ఫాతిమా వివాహం నిశ్చయమైంది. రీసెంట్ గా ఫాతిమా ఎంగేజ్‌మెంట్‌ హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా అలీ వివాహ ఆహ్వాన పత్రిక ప్రతిని  గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ కి అందిస్తూ  స్వయంగా వివాహానికి రావాలని  ప్రత్యేకంగా ఆహ్వానించారు. పెళ్లిపత్రిక స్వీకరించిన తమిళిసై కూడా, తప్పకుండా వివాహానికి హాజరు అవుతాను అని అలీకి మాటిచ్చారు.
 
అలీని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎలక్ట్రానిక్‌ మీడియా ముఖ్య సలహాదారుగా నియమించిన సంగతి తెలిసిన వెంటనే అలీ బంధువులు ఆయన ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అలీ, అయన శ్రీమతి మాట్లాడుతూ, ఎప్పటినుంచొ రావాల్సిన పదవి ఇప్పుడు రావడం అల్లా దయ అంటూ, మా అమ్మాయి పెళ్లి కానుకగా భావిస్తున్నామని చెప్పారు.