మంగళవారం, 8 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 8 నవంబరు 2022 (16:45 IST)

ఆస్ట్రేలియాలో టీ దుకాణం.. రూ.5కోట్లు సంపాదించాడు..

tea shop
tea shop
ఆస్ట్రేలియాలో టీ దుకాణం నిర్వహిస్తూ ఐదు కోట్ల రూపాయలకు పైగా సంపాదించిన యువకుడు సంచలనం రేపాడు. మనదేశానికి చెందిన ఓ యువకుడు ఆస్ట్రేలియాలో బీబీఏ చదవడానికి వెళ్లి కొన్ని కారణాల వల్ల తన చదువును సగంలోనే ఆపేశాడు. 
 
ఆ తర్వాత ఆస్ట్రేలియాలో డ్రాప్ అవుట్ చాయ్‌వాలా అనే టీ దుకాణాన్ని ప్రారంభించాడు. ఈ టీ షాప్‌కు భారీ స్పందన వచ్చిన తర్వాత, అతను చాలా బ్రాంచ్‌లను ప్రారంభించాడు. ప్రస్తుతం రూ.ఐదు కోట్ల రూపాయలకు పైగా సంపాదించినట్లు తెలుస్తోంది. 
 
టీ-దుకాణం నిర్వహిస్తూ ఐదు కోట్ల రూపాయలకు పైగా సంపాదించినా చదువుకు ప్రాధాన్యమివ్వాలని హితవు పలికాడు. తనను ఆదర్శంగా తీసుకుని యువత చదువుకు స్వస్తి చెప్పకూడదని, చదువు మనిషికి ఉన్న గొప్ప ఆస్తి అన్నాడు. సోషల్ మీడియాలో ఆయన పెట్టిన ఈ పోస్ట్ వెబ్‌సైట్లలో వైరల్ అవుతోంది.