గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 15 డిశెంబరు 2023 (16:49 IST)

బబుల్‌గమ్‌ ట్రైలర్ లో సూపర్ హిట్ కళ కనిపిస్తోంది: కే రాఘవేంద్రరావు

rana, KR- Ani, roshan and others
rana, KR- Ani, roshan and others
రవికాంత్ పేరేపు దర్శకత్వంలో హీరో రోషన్ కనకాల తొలి చిత్రం 'బబుల్‌గమ్' ప్రమోషనల్ కంటెంట్ తో ఇప్పటికే హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. డిసెంబర్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ రోజు బబుల్‌గమ్  థియేట్రికల్ ట్రైలర్ ని లాంచ్ చేశారు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, హీరో రానా దగ్గుబాటి ముఖ్య అతిథులుగా పాల్గొన్న ట్రైలర్ లాంచ్ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
 
“నా నసీబ్ లో ఎం రాసి పెట్టుందో నాకు తెల్వదు... కానీ నచ్చినట్లు మార్చుకుంటా.. కావాల్సింది లాక్కొని తెచ్చుకుంటా.. అదీ ఇజ్జత్ అయినా... ఔకాత్ అయినా’’ అనే పవర్ ఫుల్ డైలాగ్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ట్రైలర్ లో ‘బబుల్‌గమ్‌’ కథాంశాన్ని చాలా ఆసక్తికరంగా పరిచయం చేశారు. మ్యూజిక్ వరల్డ్ లో తనదైన ముద్ర వేసుకోవాలని ప్రయత్నిస్తుంటాడు డీజే రోషన్ కనకాల. మానస చౌదరిని కలిసిన తర్వాత అతను జీవితం మరో మలుపు తిరుగుతుంది. కొన్ని అనూహ్య కారణాల వలన ప్రేమ విఫలం కావడంతో తన సత్తా ఏమిటో ప్రపంచానికి చూపించాలని నిర్ణయించుకున్నాడు రోషన్. తర్వాత వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులని కట్టిపడేశాయి. దర్శకుడు రవికాంత్ పేరేపు ఈ తరం యువతకు తగ్గ కంటెంట్ ని అద్భుతంగా ప్రజంట్ చేశారు రోషన్ కనకాల బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్, డైలాగ్ డిక్షన్, పెర్ఫార్మెన్స్ ఎక్స్ ట్రార్డినరీగా వున్నాయి. మానస చౌదరి చాలా అందంగా కనిపించింది. చక్కని నటనతో ఆకట్టుకుంది.
సురేష్ రగుతు కెమెరా పనితనం బ్రిలియంట్ గా వుంది. శ్రీచరణ్ పాకాల తన అద్భుతమైన సంగీతంతో సన్నివేశాలను ఎలివేట్ చేశాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రొడక్షన్ డిజైన్ అంతా గ్రాండ్‌గా ఉంది. మొత్తానికి ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.
 
కే రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. సుమ మొహం ఆనందంతో అప్పుడే వెలిగిపోతుంది(నవ్వుతూ). బబుల్‌గమ్‌ ట్రైలర్ లో సూపర్ హిట్ కళ కనిపిస్తోంది. బబుల్‌గమ్‌ మెల్లగా ఉబ్బి ఉబ్బి పెద్దగా పేలుతుంది. ఈ సినిమా టాక్ కూడా మెల్లగా స్టార్ట్ అయి సూపర్ హిట్ టాక్ తో ఎండ్ అవుతుంది. రోషన్, మానస కెమిస్ట్రీ చాలా బావుంది. సినిమా ఖచ్చితంగా చాలా బాగా ఆడుతుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. పీపుల్ మీడియా నాకు సొంత కుటుంబం లాంటింది. వారి ద్వారా విడుదలైన సినిమాలన్నీ అద్భుతంగా ఆడాయి. ఈ సినిమా కూడా ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుంది’’ అన్నారు.
 
అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. సుమ, రాజీవ్ గారికి డిసెంబర్ 29 ఒక ప్రౌడ్ మూమెంట్. ట్రైలర్  చాలా అద్భుతంగా వుంది. ఖచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. యూత్ ట్రెండ్ లో మంచి కంటెంట్ వదిలితే ప్రేక్షకులు దాన్ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెలుతున్నారు. బబుల్‌గమ్‌ కూడా యూత్ కే కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ వున్నాయి. చాలా మంచి లైవ్ స్టొరీ కనిపిస్తోంది. రవికాంత్ గత చిత్రాలు కూడా చూశాను. ఈ చిత్రాన్ని కూడా చాలా అద్భుతంగా తీశారు. రోషన్ చాలా యూనిక్ గా వున్నాడు. తన పెర్ఫార్మెన్స్ విలక్షణంగా వుంది. తనలో చాలా ఎనర్జీ వుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. సుమ గారి స్టయిల్ లో సక్సెస్ పార్టీ చాలా గ్రాండ్ గా ఏర్పాటు చేయాలి. మళ్ళీ సక్సెస్ మీట్ లో కలుద్దాం’’ అన్నారు.
 
రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. సుమ గారు మా జీవితాల్లో భాగమైపోయారు. నిరంతం ప్రోత్సహిస్తూ వుంటారు. రోషన్ కి అందరి ప్రేమ, అభిమానం దక్కాలని కోరుకుంటున్నాను. దర్శకుడు రవికాంత్ కథలు కొత్తగా వుంటాయి. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. సినిమా ఖచ్చితంగా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.’’ అన్నారు
 
రోషన్ మాట్లాడుతూ.. రాఘవేంద్రరావు గారు మా ట్రైలర్ ని లాంచ్ చేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాం. అనిల్ రావిపూడి గారు ఈ వేడుకకు వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడం చాలా గొప్ప అనుభూతి. రానా అన్న మా అందరికీ స్ఫూర్తి. కొత్త వాళ్ళని ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందువుంటారు. రవికాంత్ మానస .. మా టీం అందరికీ ధన్యవాదాలు. ఇది చలికాలం. కొంచెం వెచ్చగా వుండాలని ఇలాంటి ఫైర్ లాంటి ట్రైలర్ ని దింపాడు రవికాంత్. (నవ్వుతూ) జీవితంలో ఎదో సందర్భంలో రివెంజ్ తీర్చుకోవాలనిపిస్తుంది. ఈ సినిమాలో ఆది పాత్ర మాటల్లో చెప్పాలంటే.. ‘ఒక రోజు వస్తది. ఆ రోజు చెవులు మూసుకున్నా వినపడతా. కళ్ళుమూసుకున్నా కనపడతా’’. ఈ వేడుకకు విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు’’ తెలిపారు.
 
దర్శకుడు రవికాంత్ పెరేపు మాట్లాడుతూ..  రాఘవేంద్రరావు గారు క్షణం సినిమా నుంచి నన్ను సపోర్ట్ చేస్తున్నారు. అలాగే అనిల్ రావిపూడి గారు, రానా గారికి థాంక్స్. చాలా క్రేజీ టీంతో కలసి పని చేశాను. మా ప్రొడక్షన్ టీం మహేశ్వరి మూవీస్ థాంక్స్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రజెంట్ చేయడం చాలా అనందంగా వుంది. పోస్ట్ ప్రొడక్షన్ టీం అంతా జెట్ స్పీడ్ లో పని చేస్తున్నారు. శ్రీ చరణ్ పాకాలతో ఇది నా మూడో చిత్రం. క్రేజీ మ్యూజిక్ ఇచ్చారు. ట్రైలర్ కంటే సినిమా ఇరవై రెట్లు హై ఇస్తుంది. సినిమా అందరికీ క్రేజీక్రేజీ గా నచ్చుతుంది. రోషన్, మానస గురించి చాలా ప్రత్యేకంగా చెప్పాలి. చాలా అద్భుతంగా నటించారు. వంశీ గారికి,  స్క్రిప్ట్ లో గైడ్ చేసిన అబ్బూరి రవి గారికి థాంక్స్. బబుల్‌గమ్‌ అంటుకుంటే తీసేయాలనిపిస్తుంది. కానీ ఈ బబుల్‌గమ్‌ ఎదురెళ్ళి అంటించుకోవాలనిపిస్తుంది. తప్పకుండా అందరూ థియేటర్స్ లో చూడాలి’’ అని కోరారు.
 
మానస చౌదరి మాట్లాడుతూ.. రాఘవేంద్రరావు గారు, అనిల్ రావిపూడి గారు, రానా గారికి థాంక్స్. ఈ చిత్రంలో అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. రోషన్ వండర్ పుల్ కో స్టార్. ఈ సినిమా చూడటానికి మీతో పాటు నేనూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అన్నారు  
 
వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ.. బబుల్‌గమ్‌ ట్రైలర్ చాలా యూత్ ఫుల్ గా వుంది. ఈ మధ్య బేబీ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలుసు. అలాగే ఈ సినిమా కూడా అంత పెద్ద సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను. రాఘవేంద్రరావు గారికి, అనిల్ గారికి, రానా గారికి చాలా థాంక్స్’’ తెలిపారు  
 
శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ.. శ్రీకాంత్ పెరేపు న్యూ ఏజ్ ఫిలిం మేకర్, నన్ను కంపోజర్ గా మార్చింది ఆయనే. బబుల్‌గమ్‌ చాలా గొప్ప అనుభూతిని ఇచ్చే చిత్రం. రోషన్, మానస అద్భుతంగా నటించారు. సినిమాని తప్పకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు’’అన్నారు. ఈ వేడుకలో సుమ, రాజీవ్ కనకాలతో పాటు బబుల్‌గమ్‌ చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.