గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (14:22 IST)

రవితేజ సోదరుడి కొడుకు మాధవ్ మిస్టర్ ఇడియ‌ట్‌ తో హీరోగా స్థిరపడాలి : కె రాఘవేంద్రరావు

Director K Raghavendra Rao launched the first look poster of Mr. Idiot.
Director K Raghavendra Rao launched the first look poster of Mr. Idiot.
మాస్ మహరాజ్ రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా న‌టిస్తోన్న‌ సినిమా "మిస్టర్ ఇడియ‌ట్‌". ఈ చిత్రంలో సిమ్రాన్ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోంది. జేజేఆర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీమతి యలమంచి రాణి సమర్పణలో నిర్మాత జె జే ఆర్ రవిచంద్  మిస్టర్ ఇడియ‌ట్‌ సినిమాను నిర్మిస్తున్నారు. పెళ్లి సందడి చిత్రంతో కమర్షియల్ హిట్ అందుకున్న దర్శకురాలు గౌరీ రోణంకి డైరెక్ట్ చేస్తున్నారు. ఇవాళ శుక్రవారం హీరో మాధవ్ పుట్టినరోజు సందర్భంగా మిస్టర్ ఇడియ‌ట్‌ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రిలీజ్ చేశారు. 
 
ఈ సందర్భంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ - ముందుగా మాధవ్ కు బర్త్ డే విశెస్ చెబుతున్నా. ఇవాళ నా చేతుల మీదుగా మిస్టర్ ఇడియట్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. పెళ్లిసందడి లాంటి మంచి రొమాంటిక్ ఎంటర్ టైనర్ రూపొందించిన నా శిష్యురాలు గౌరీ రోణంకి ఈ చిత్రాన్ని కూడా అందరినీ ఆకట్టుకునేలా తెరకెక్కించిందని ఆశిస్తున్నాను. మాస్ మహారాజ రవితేజ సోదరుడు రఘు కొడుకు మాధవ్ ఈ సినిమాతో హీరోగా స్థిరపడాలని విష్ చేస్తున్నా. రవితేజ ఇడియట్ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ఈ మిస్టర్ ఇడియట్ కూడా అంతకంటే పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. ఈ సినిమా యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.
 
దర్శకురాలు గౌరీ రోణంకి మాట్లాడుతూ  - నా మొదటి సినిమా పెళ్లి సందడికి మా గురువు గారు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. ఆ సినిమాను సక్సెస్ చేసి మీరంతా నన్ను ఆశీర్వదించారు. నా రెండో సినిమా మిస్టర్ ఇడియట్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి బ్లెస్ చేసిన మా గురువు గారికి థాంక్స్ చెబుతున్నా. ఈ సినిమా కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
 
నిర్మాత జె జే ఆర్ రవిచంద్ మాట్లాడుతూ - మా మిస్టర్ ఇడియట్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రాఘవేంద్రరావు గారు రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. ఆయనకు థాంక్స్ చెబుతున్నా. అలాగే నా వెంటే ఉండి సపోర్ట్ చేస్తున్న నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు గారికి కృతజ్ఞతలు. మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్, ఎడిటర్ విప్లవ్,  సినిమాటోగ్రఫీ రామ్, ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్.. ఇలా టాలెంట్ ఉన్న మంచి టెక్నీషియన్స్ మా సినిమాకు పనిచేశారు. మాధవ్ కు మా టీమ్ అందరి తరుపున హ్యాపీ బర్త్ డే చెబుతున్నాం. ఈ మూవీలో ఆయన యాక్టింగ్ ఇంప్రెస్ చేస్తుంది. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నవంబర్ లో మిస్టర్ ఇడియట్ ను థియేటర్స్ లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. అన్నారు.