సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 11 నవంబరు 2023 (16:55 IST)

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర చిత్రం షూటింగ్ లేటెస్ట్ అప్ డేట్

Viswmbhara title
Viswmbhara title
మెగాస్టార్ చిరంజీవి 156వ సినిమా విశ్వంభర చిత్రం షూటింగ్ లేటెస్ట్ అప్ డేట్ వచ్చేసింది. నవంబర్ 22 నుంచి షూటింగ్ ప్రారంభించనున్నారు. దసరా సందర్భంగా ఈ మూవీని లాంఛనంగా ప్రారంభించారు. ఈ చిత్ర పూజా కార్యక్రమాలకు దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు  క్లాప్ కొట్టాడు. యూవీ క్రియేషన్స్ దాదాపుగా రెండు వందల కోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్టు తెలుస్తోంది. మెగాస్టార్ 157వ సినిమాగా రావాల్సిన వశిష్ట ప్రాజెక్ట్ 156వ సినిమాగా రాబోతోంది.
 
కాగా, ఈ షూటింగ్ ను చిరంజీవి లేకుండా తీయబోతున్నారు. చిరు లేకుండా కొన్ని ఫారెస్ట్ సీన్స్ తీయబోతున్నారు. డిసెంబర్ లేదా జనవరి నుండి చిరు షూటింగ్ లో పాల్గొంటారు. అనుష్క ఈ సినిమాలో నాయికగా నటించనుంది. మిగిలిన వివరాలు త్వరలో తెలియనున్నాయి.