బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 6 నవంబరు 2023 (16:47 IST)

ఐదు వేల నుంచి కోటి రెమ్యునరేషన్, రాజకీయాల్లో ఆమె నాకు స్పూర్తి : విజయశాంతి

Vijayashanti
Vijayashanti
నటి విజయశాంతికి లేడీ అమితాబ్ అనే పేరు వుంది. తెలుగు సినిమా రంగంలో ఆమెది ప్రత్యేక శైలి. హీరోకు ధీటుగా నటించే ఆమె తొలిసారిగా నటిగా రెమ్యునరేషన్ ఐదువేలు. కానీ ఆ నిర్మాత మూడు వేలు మాత్రమే ఇచ్చారు. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ కర్తవ్యం సినిమాకు కోటి రూపాయల తీసుకోవడం నాకే ఆశ్చర్యం కలిగించింది. ఇదంతా దేవుడు దయ అని విజయశాంతి అన్నారు. ఇటీవలే ఓ ఇంటర్యవూలో మాట్లాడారు.
 
తెలంగాణలోని ఏటూరు నాగారం లో పుట్టి పెరిగిన విజయశాంతి, ఆ టైంలో రజాకార్ల ఉద్యమం ఉద్రుతంగా వుండగా మా తాతగారు చెన్నై వెళ్ళిపోయారు. 36 మంది మా కుటుంబీలం. మా తాత గారు వెయ్యి ఎకరాల భూమిని వదులుకొని వచ్చేశారు అని తెలిపింది. 
 
నా జీవితంలో అన్నీ చిత్రాలే జరిగాయి. నటిగా పీక్ స్టేజీకి వెళతానని అనుకోలేదు.  హీరోలు  25, 30 లక్షల రెమ్యునరేషన్ తీసుకునే రోజుల్లో నాకు కోటి ఇవ్వడం దేవుడు నన్ను నడిపించాడని భావిస్తున్నా. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చాను.  మా తల్లి తెలంగాణ పార్టీ పెట్టాను. సేవ చేయాలనుకున్నా. కానీ రాజకీయాల్లో చాలా ఎదురుదెబ్బలు వుంటాయని తెలిసింది. అందుకే కొంతకాలం దూరంగా వున్నానని చెప్పారు. 
 
రాజకీయపరంగా జయలలిత నాకు ఆదర్శం. ఆమె అంత కాకపోయినా అంతలా ప్రజలకు సేవ చేయాలని భావిస్తున్నా. అని చెప్పింది.