గురువారం, 2 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 4 అక్టోబరు 2022 (16:16 IST)

వాడిని ముఖ్యమంత్రిని చేసేందుకు మద్దతిస్తానేమో? చిరంజీవి

chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడు, హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు తన వంతుగా మద్దతు ఇవ్చొచ్చునేమో అంటూ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఏమైనా జరగొచ్చని చెప్పారు. 
 
తాను నటించిన కొత్త చిత్రం "గాడ్‌ఫాదర్". దసరా కానుకగా అక్టోబరు ఐదో తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో చిత్ర బృందం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిరంజీవి పాల్గొని ప్రసంగించారు. 
 
ఇందులో తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు వచ్చిన వార్తలపై స్పందించారు. ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు క్రియేట్ చేస్తారోగానీ వాళ్లు గొప్ప క్రియేటర్స్. అలాంటి వాళ్లు సినిమా ఇండస్ట్రీకి వచ్చి నాకు కథలు అందించవచ్చు. ఆ కథలతో అద్భుతమైన చిత్రాలు వస్తాయి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే, తన సోదరుడుకి భవిష్యత్‌లో మద్దతు ఇవ్వొచ్చునేమో అంటూ సందేహం వ్యక్తం చేశారు. 
 
"గాడ్‌ఫాదర్" చిత్రంలో ప్రస్తుత రాజకీయ నేతలపై ఎలాంటి సెటైర్లు వేయలేదన్నారు. కథ ఆధారంగానే డైలాగులు రాయడం జరిగిందన్నారు. రాజకీయాలు, కుటుంబం ఈ రెండూ కలిస్తే ఈ సినిమా అని అన్నారు.
 
మరో అగ్రహీరో నాగార్జున నటించిన "ది ఘోస్ట్" చిత్రం కూడా అక్టోబరు 5నే విడుదల అవుతుంది. దీనిపై ఆయన స్పందిస్తూ, పండగుపూట ఇద్దరం కలిసి భోజనానికి వెళుతున్నట్టు ఉందని చమత్కరించారు. తామిద్దరి చిత్రాలు ఒకే రోజున విడుదల కానుండటం ఆనందంగా ఉందన్నారు.