గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr

తమిళ 'అర్జున్ రెడ్డి'గా విక్రమ్ వారసుడు

విజయ్ దేవరకొండ హీరోగా తెలుగులో వచ్చిన చిత్రం అర్జున్ రెడ్డి. ఈ చిత్రం విడుదలకు ముందు.. విడుదల తర్వాత పెను వివాదమే సృష్టించింది. ఈ చిత్రంలో హీరోగా నటించే అవకాశం తొలుత శర్వానంద్‌కు వచ్చింది. కానీ, అతను

విజయ్ దేవరకొండ హీరోగా తెలుగులో వచ్చిన చిత్రం అర్జున్ రెడ్డి. ఈ చిత్రం విడుదలకు ముందు.. విడుదల తర్వాత పెను వివాదమే సృష్టించింది. ఈ చిత్రంలో హీరోగా నటించే అవకాశం తొలుత శర్వానంద్‌కు వచ్చింది. కానీ, అతను నటించలేదు. ఆ తర్వాత విజయ్ దేవరకొండకు రావడంతో ఆయన ఓకే చెప్పారు. ఫలితంగా తన ఖాతాలో ఓ మంచి విజయాన్ని వేసుకున్నారు. 
 
ఇపుడు ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ కానుంది. తమిళ 'అర్జున్‌ రెడ్డి'గా ‘చియాన్‌’ విక్రమ్‌ వారసుడు ధృవ్‌ విక్రమ్‌ కనిపించనున్నారు. ఈ విషయాన్ని విక్రమ్ స్వయంగా వెల్లడించారు. ‘రెడీ టు మేక్‌ ద లీప్‌. ధృవ్‌ టు బి అర్జున్‌ రెడ్డి’ అని తనయుడి వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో విక్రమ్‌ పోస్ట్‌ చేశారు. 
 
తమిళ్‌తో పాటు తెలుగు ప్రేక్షకులకూ విక్రమ్‌ సుపరిచితుడే. ఎప్పట్నుంచో ధృవ్‌ విక్రమ్‌ ఎంట్రీ గురించి వార్తలొస్తున్నాయి. డిఫరెంట్‌ ఫిల్మ్స్‌లో నటించే విక్రమ్‌... తనయుడి ఎంట్రీకీ డిఫరెంట్‌ కథనే ఎంచుకోవడం విశేషం. ఈ చిత్రానికి తెలుగులో సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే.