శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 18 అక్టోబరు 2022 (17:59 IST)

ఢిల్లీలో తిరుప‌తి ల‌డ్డు ఇక్క‌డ కార్య‌క‌ర్త‌ల‌పై కేసులుః ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎద్దేవా

Pawan Kalyan
Pawan Kalyan
విశాఖ ప‌ట్నంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌ర్య‌ట‌న‌, అనంత‌ర ప‌రిణామాలను టాలీవుడ్ గ‌మ‌నిస్తోంది. ప‌వ‌న్ క‌ళ్యాన్ ప్ర‌వ‌ర్తించిన విధానం అభినందించిది. ఇందుకు మంగ‌ళ‌వారంనాడు ఆయ‌న ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన తీరును ఫిలింఛాంబ‌ర్‌లో చ‌ర్చించుకున్నారు. ప‌వ‌న్ ఇది వరకు మాట్లాడని మాటలతో ఓ రేంజ్ లో స్పీచ్ ఇవ్వడం అభిమానుల్లో ఆసక్తిగా మారింది. మరి పవన్ నుంచి ఇప్పటివరకు వచ్చిన పొలిటికల్ స్పీచ్ లు వేరు ఇది వేరు అని చెప్పాలి.
 
ప‌వ‌న్‌కు మ‌ద్ద‌తుగా ఎ.పి. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు చంద్ర‌బాబు హాజ‌రై సంఘీ భావం తెలిపారు. చంద్ర‌బాబు మాట్లాడుతూ, 40 ఏళ్ళుగా నేను చూస్తున్నా. అధికార పార్టీ, ప్ర‌తి ప‌క్ష‌నాయ‌కులు మీటింగ్‌కు వ‌స్తే ఎదురు ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌గా పోలీసులు త‌మ డ్యూటీ చేస్తారు. కానీ నేడు అది జ‌ర‌గ‌లేదు. పోలీసులు చాలా దారుణంగా ప్ర‌వ‌ర్థించారు. ప‌వ‌న్ కారును అడ్డుకున్న ఓ పోలీసు అధికారి రాక్ష‌సానందం చూపారు. అంతేకాకుండా రాత్రి పూట కారులో ప్ర‌యాణిస్తుంటే లైట్ల‌న్నీ తీసేశారు. ఇదేనా ప్ర‌జాస్వామ్యం అని ప్ర‌శ్నించారు.
 
ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ, న‌న్ను ఇబ్బంది పెట్టిన తీరును చూసి ఎ.పి. తెలంగాణ‌కు చెందిన ప‌లువురు నాయ‌కులు మ‌ద్ద‌తు ప‌లికారు. చంద్ర‌బాబునాయుడు సంఘీభావంతెలిపారు. సి.పి.ఎం.., సి.పి.ఐ., బిజెపితో స‌హా అన్ని పార్టీలు మ‌ద్ద‌తు తెలిపాయి. ప్ర‌జాస్వామ్యం అంటే ఇదేనా! ఢిల్లీ వెళ్ళి అక్క‌డ తిరుప‌తి ల‌డ్డులు ఇచ్చి వ‌స్తారు. ఇక్క‌డ బిజెపి కార్య‌క‌ర్త‌ల‌పై దాడులు చేస్తారు. ఇక కామ‌న్ మాన్ ప‌రిస్థితి ఏమిటి? అందుకే ఎ.పి.లో ప్ర‌జాస్వామ్యాన్ని బ‌తికించాలి అని పిలుపునిచ్చారు.