Daily Horoscope
✕

కోబ్రా థియేట్రికల్ ట్రైలర్‌ విడుదల

Written By డీవీ
Updated: శనివారం, 27 ఆగస్టు 2022 (16:02 IST)
Vikram, Srinidhi Shetty
చియాన్ విక్రమ్ కధానాయకుడిగా వైవిధ్యమైన సినిమాలతో ఆకట్టుకునే దర్శకుడు ఆర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ 'కోబ్రా ఆగస్ట్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతుంది. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం తెలుగులో ఎన్వీ ప్రసాద్ ఎన్వీఆర్ సినిమా ద్వారా విడుదలౌతుంది. తాజాగా 'కోబ్రా' థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.
 
''హి ఈజ్ ఏ కోబ్రా. రకరకాలుగా రూపం మార్చుకొని వెళ్ళడం తెలుసు. చాటుగా మాటేసి కాటేయడమూ తెలుసు.'' అనే వాయిస్ ఓవర్ తో మొదలైన ట్రైలర్.. హైవోల్టేజ్ యాక్షన్, విక్రమ్ రకరకాల అవతారాలు, నట విశ్వరూపంతో మైండ్ బ్లోయింగ్ అనిపించింది. తన జీవితంలోని ప్రతి ఒక్క సెకను అంకెలను పీల్చుకునే, ప్రతి సమస్యకు గణితశాస్త్రంలో పరిష్కారం కనుగొని, దేశ విదేశాలు తిరుగుతూ, గణితశాస్త్రన్ని వుపయోగించి నేరాలు పాల్పడిన మేధావి కోబ్రా పాత్రలో విక్రమ్ పెర్ఫార్మమెన్స్ బ్రిలియంట్ గా వుంది.
 
ఈ చిత్రంతో సినిమాల్లోకి అరంగేట్రం చేస్తున్న భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అంతుచిక్కని కోబ్రా కోసం వేటలో ఉన్న పోలీసుగా కనిపించారు. శ్రీనిధి శెట్టి విక్రమ్ ప్రేయసిగా కనిపించగా,  రోషన్ మాథ్యూ నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించాడు.
 
విక్రమ్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో పాటు  వైబ్రెంట్ విజువల్స్,  హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌లు  ఈ చిత్రానికి బిగ అసెట్స్ గా నిలిచాయి. ట్రైలర్ కి ఏఆర్ రెహమాన్ అందించిన నేపధ్య సంగీతం నెక్స్ట్ లెవల్ లో వుంది. హరీష్ కన్నన్ కెమెరా పనితనం రిచ్ గా వుంది.
ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో ఆగస్ట్ 31న విడుదలౌతుంది.

అన్నీ చూడండి

నవంబర్ 29, 2026, ఆదివారం నాడు వాతావరణం ఎలా వుందంటే?

తిరుపరంగుండ్రంలో వానర రూపంలో హనుమంతుని రాక జరిగిందా? (video)

విద్యార్థినులను వేధించిన ప్రభుత్వ టీచర్.. అరెస్ట్ చేసిన పోలీసులు

ఆప్ఘనిస్థాన్‌ పాఠశాల సమీపంలో పేలుడు.. పది మంది మృతి.. 110 మందికి గాయాలు

తిరుప్పరంకుండ్రం కొండపై వెలిగించిన పవిత్ర దీపం- ధర్మ విజయం (video)

అన్నీ చూడండి

చీజ్ పఫ్‌తో ఆరోగ్య సమస్యలు... ఏంటవి?

శీతాకాలంలో నెయ్యి సైడ్ ఎఫెక్ట్స్

ఏపీలో సమాజ ఆధారిత కేన్సర్ నివారణ, ముందస్తు గుర్తింపులో ఫైజర్- టాటా కేన్సర్ కేర్ ఫౌండేషన్

కాలేయ ఆరోగ్యానికి సహాయపడే సహజ పద్ధతులు ఏమిటి?

నెఫ్రోప్లస్: డయాలిసిస్‌కు అనుకూలమైన ఆహారోత్సవం ద్వారా రోగులు, సంరక్షకులను ఒకేచోట

తర్వాతి కథనం
Show comments