శుక్రవారం, 22 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 26 మే 2023 (12:07 IST)

హాస్యబ్రహ్మకు ఎన్టీఆర్ పురస్కారం.. మహాభాగ్యం అంటోన్న బ్రహ్మానందం

Brahmanandam
హాస్యబ్రహ్మ ఎన్టీఆర్ పురస్కారాన్ని అందుకున్నారు. ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల సందర్భంగా బ్రహ్మానందానికి ఈ అవార్డు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన 35 మందికి ఎన్టీఆర్‌ సెంటినరీ పురస్కారాలు అందించారు. 
 
ఈ సందర్భంగా అవార్డు గ్రహీత బ్రహ్మానందం మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌తో తక్కువ సినిమాలు చేసినా.. ఆయన వద్ద చాలా నేర్చుకున్నానని తెలిపారు. 
 
ఎన్టీ రామారావు పురస్కారం అందుకోవడం మహాభాగ్యమని... తెలుగు సినిమా చరిత్రలో ఎన్టీఆర్ యుగం స్వర్ణయుగం అంటూ పేర్కొన్నారు. కాగా ప్రతీ యేట స్వర్గీయ ఎన్టీ రామారావు పేరిట అవార్డును ప్రధానం చేయడం పరిపాటి. 
 
ఈ ఏడాది జరిగిన కార్యక్రమంలో శాసన సభ్యుడు గద్దె రామ్మోహన్‌రావు, టీడీపీ మహిళా నాయకురాలు నన్నపనేని రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.