గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (16:01 IST)

యూపీ సీఎం యోగికి హత్యా బెదిరింపులు...

yogi adityanath
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు గుర్తు తెలియని వ్యక్తి చంపేస్తానని బెదిరించాడు. 112 అనే టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్ చేసిన గుర్తు తెలియని వ్యక్తి త్వరలోనే యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తామని చెప్పాడు. దీంతో నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. దీనిపై రంగంలోకి దిగిన యాంటీ టెర్రర్ వింగ్ స్క్వాడ్ ఆరా తీస్తుంది. 
 
112 టోల్ ఫ్రీ నంబరుకు కాల్ చేసి సీఎం యోగిని త్వరలోనే చంపేస్తా అని బెదిరించాడు. ఆ తర్వాత యూపీ పోలీస్ సోషల్ మీడియా డెస్క్‌కు కూడా టెక్స్ట్ మెసేజ్ పంపించాడు. దీంతో పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. సీఎంకు బెదిరింపుల నేపథ్యంలో ఉగ్రవాద నిరోధక పోలీసు దళం యాంటీ టెర్రక్ స్క్వాడ్ కూడా రంగంలోకి దిగింది.
 
నిందితుడి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. కాగా, అత్యవసర సమయాల్లో ప్రజలు ప్రభుత్వం సాయం కోరేందుకు వీలుగా యోగి సర్కారు ఈ టోల్ ఫ్రీ నంబరును ప్రవేశపెట్టింది. కొందరు దండుగులు ఈ ఫోన్ నంబరుకు ఫోన్ చేసి ఈ విధంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు.