ఆదివారం, 24 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : గురువారం, 4 మే 2023 (19:07 IST)

కర్ణాటక ఎన్నికలు.. చిక్కబల్లాపూర్‌లో బ్రహ్మానందం ప్రచారం

కర్ణాటక ఎన్నికల రణరంగం వేడెక్కుతున్న తరుణంలో రాజకీయ పార్టీల నేతలు, మద్దతుదారులు తమ ప్రత్యర్థులను గెలిపించేందుకు విస్తృతంగా ప్రచారం చేపట్టారు. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు సినీ తారలు సైతం రంగంలోకి దిగారు. వీరిలో టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం కూడా ఒకరు. 
 
కన్నడ రాజకీయాల్లోకి బ్రహ్మానందం అడుగుపెట్టారు. బ్రహ్మానందం ఇటీవల చిక్కబళ్లాపూర్‌లో బీజేపీ అభ్యర్థి సుధాకర్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నియోజకవర్గంలో చాలామంది తెలుగు మాట్లాడేవారు ఉండటంతో ప్రజలతో మమేకమై తెలుగులో మాట్లాడారు. నటుడు ఆరోగ్య మంత్రి డాక్టర్ కె సుధాకర్‌కు బ్రహ్మానందం మద్దతునిచ్చారు ఆయన కోసం చిక్కబల్లాపూర్‌లో ప్రచారం చేశారు.