బుధవారం, 29 మార్చి 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated: శుక్రవారం, 23 సెప్టెంబరు 2022 (09:07 IST)

ఆ మహిళలు వ్యభిచారులైతే బిగ్ బాస్‌లో ఉన్న వాళ్లు..?: సీపీఐ నారాయణ

narayana
బుల్లితెర ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచే కార్యక్రమాలలో బిగ్ బాస్ తొలి స్థానంలో వుంది. ఇటీవల నల్గొండలో ఇద్దరు మహిళలకు గుండు కొట్టించిన సంఘటన జరిగింది. వాళ్లు వ్యభిచారులు కాబట్టి గుండు కొట్టించామని అంటున్నారు స్థానికులు. అయితే దీనిని తీవ్రంగా ఖండించారు సిపిఐ నారాయణ. 
 
తాజాగా సిపిఐ నారాయణ సంచలన కామెంట్స్ చేశారు. బిగ్ బాస్‌లో ఉన్న వాళ్లకి మాత్రం చప్పట్లు కొడుతూ విజిల్స్ వేస్తారు. ఆ మహిళలు వ్యభిచారులైతే బిగ్ బాస్‌లో ఉన్న వాళ్లు కూడా అంతే .. మరి వీళ్ళకెందుకు సపోర్ట్ చేస్తున్నారు అంటూ నారాయణ కాస్త గట్టిగానే ప్రశ్నించారు.
 
అంతేకాదు నల్గొండలో సామాన్య మహిళలకు గుండు కొట్టించి అవమానించారని.. కానీ బిగ్ బాస్ షోలను మాత్రం ప్రోత్సహిస్తారు. ఇదేం దారుణమైన పరిస్థితి అంటూ ఆయన ప్రశ్నించారు.
 
అంతేకాదు సిపిఐ నారాయణ కొంచెం హద్దులు దాటుతూ పెళ్లయిన వాళ్ళకి అది శోభనం గది.. మరి పెళ్లి కానీ వాళ్లకి ఏంటి అంటూ ప్రశ్నించారు. మరి ఈ విషయంపై నాగార్జున ఎలా స్పందిస్తారో తెలియాల్సింది.