1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 24 ఫిబ్రవరి 2024 (15:21 IST)

దేవాలయానికి రూ. 1.7 లక్షలు ఇచ్చిన డియర్ ఉమ హీరోయిన్ సుమయా రెడ్డి

Sumaya Reddy at Simhadri Puram Sri Venkateswara Swamy temple
Sumaya Reddy at Simhadri Puram Sri Venkateswara Swamy temple
‘డియర్ ఉమ’ సినిమాతో నిర్మాత, హీరోయిన్‌గా తెరపైకి రాబోతున్నారు సుమయా రెడ్డి. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పనుల్ని పూర్తి చేశారు. ఈ మధ్యే సినిమాకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేయగా మంచి స్పందన వచ్చింది. ఇక త్వరలోనే సుమయ రెడ్డి తన బహు ముఖ ప్రజ్ఞతో అందరినీ ఆకట్టుకోనున్నారు. సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్ మీద డియర్ ఉమ అనే చిత్రం త్వరలోనే రాబోతోంది. 
 
‘డియర్ ఉమ’ చిత్రంలో సుమయ రెడ్డి, దియా మూవి ఫేమ్ పృథ్వీ అంబర్ జంటగా నటిస్తున్నారు. ఈ మూవీకి సుమయ రెడ్డి నిర్మాతగా.. నగేష్ లైన్ ప్రొడ్యూసర్‌గా, నితిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్వవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలు చూసుకుంటున్నారు.
 
తాజాగా సుమయా రెడ్డి సింహాద్రి పురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆమె గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడారు. ‘డియర్ ఉమ సినిమాతో తొలిసారిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. ప్రేమ కథా చిత్రంగా రాబోతున్న ఈ మూవీ టీజర్‌ను ఇటీవలె విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. మే నెలలో సినిమాను విడుదల చేయబోతున్నామ’ని అన్నారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి తనవంతుగా రూ.1.7 లక్షలు విరాళంగా ఇచ్చారు.