ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ వెబ్ సిరీస్ గా పిలవబడే "సేక్రేడ్ గేమ్స్"లో నటించి పేరు తెచ్చుకున్న నటి 'ఎల్నాజ్ నొరౌజీ'. "కాందహార్" చిత్రంతో హాలీవుడ్‌లో తెరగేంట్రం చేసి, పాపులర్ గెరార్డ్ బట్లర్‌తో స్క్రీన్‌ను పంచుకుంది. తాజాగా , నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన 'డెవిల్' చిత్రంలో ఈ ముద్దుగుమ్మ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి చిత్రంతోనే ముఖ్యమైన పాత్ర పోషిస్తూ, సెక్సీ లుక్స్ తో ప్రత్యేక పాటలో నర్తించి అందరిని కవ్వించింది.
ప్రస్తుతం ఈ సాంగ్ తెగ వైరల్ అవుతోంది. డిసెంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన "డెవిల్" సూపర్ హిట్ టాక్ తో బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ 'ఎల్నాజ్ నౌరౌజీ' పలు విషయాలు తెలిపారు.
ఇరాన్‌లో పుట్టి, జర్మనీలో పెరిగిన మీరు.. ఇండియన్ సినిమాకి ఎలా వచ్చారు?
- నేను చిన్నప్పటి నుంచి హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలు చూస్తూ పెరిగాను. సో.. బాలీవూడ్ లో యాక్ట్ చేయాలనీ నా కల. ప్రపంచంలో ఎక్కడ లేని ప్రత్యేకత భారత్ కి ఉంది. ఇక్కడ అన్ని కళలని ప్రోత్సహిస్తారు. నాకు బాగా నచ్చింది. అందుకే ఇక్కడ యాక్ట్ చేయాలనుకున్నాను.
దాదాపు మీరు భారతదేశాన్ని మీ స్వస్థలంగా మార్చుకున్నట్టున్నారు?
నిజమే. ఇప్పుడు నాకు భారతదేశం నా సొంత ఇల్లు లాంటిది. ఇప్పటికే ఇండియాలో 8 సంవత్సరాలుగా వుంటున్నాను.. ఆల్ రెడీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి ఐదు సంవత్సరాలు గడిచాయి.
తెలుగు సినిమాలో పనిచేసిన అనుభవం ఎలా ఉంది?
'డెవిల్', సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో ఓ పాట ద్వారా స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చాను. మంచి రెస్పాన్స్ వచ్చింది. సౌత్ లో ప్రజలు చాలా పోలైట్ గా, కుటుంబ సాంప్రదాయాలకు విలువలు ఇస్తారు. ముఖ్యంగా, తెలుగు ప్రజలు అంటే నాకు చాలా ఇష్టం. తెలుగు సినిమాలో నటించడం నాకు చాలా గర్వంగా ఉంది. అవకాశాలు వస్తే తెలుగులో అందరి హీరోలతో తప్పకుండా చేస్తాను.
డెవిల్‌లో ఛాన్స్ ఎలా వచ్చింది?
- ఇంతకముందు తెలుగులో ఏ సినిమా చేసిన ఎక్సపీరియన్స్ లేదు. 'డెవిల్' లో సాంగ్ చేయడానికి చాలా హోమ్ వర్క్ చేశాను, కొన్ని విషయాలు తెలియకపోతే తెలుసుకొని చేశాను. నాకు, ఈ సినిమాలో నా నృత్యాన్ని చూసి తీసుకున్నారు. నాకు పెద్దగా బ్యానర్స్ గురించి తెలియదు. దక్షిణాదిలో అభిషేక్ పిక్చర్స్ ప్రొడక్షన్లో పని చేయటం, వాళ్ళ ద్వారా ఇంట్రడ్యూస్ అవ్వడం చాలా హ్యాపీగా భావిస్తున్నాను.
మీకు ఈ సినిమా ఎంత ప్రత్యేకం?
పిరియాడికల్ ఫిల్మ్ తీయడం చాలా కష్టం. పైగా.. చాలా బడ్జెట్ తో కూడినది. క్యారెక్టర్ చేసేటప్పుడు కథని అర్ధం చేసుకోవాలి. దానికి తగ్గట్టు కాస్ట్యూమ్స్ ధరించాలి. అప్పుడే, తెర మీద అద్భుతంగా వస్తుంది. ఈ సినిమాలో నా లుక్ చాలా స్పెషల్. హెయిర్, రెడ్ లిప్స్ జాజ్ టైప్ మ్యూజిక్, నేను ఇంతక ముందు అలా ఎప్పుడు కనిపించలేదు కూడా.. స్పెషల్ గా నాకు ఈ సినిమా ప్రత్యేకమనే చెప్పాలి.
హీరో కళ్యాణ్‌రామ్‌తో పని చేయడం ఎలా అనిపించింది?
- కళ్యాణ్ రామ్ తో కలిసి పనిచేయడం నా అదృష్టం. ఆయన సెట్‌లో చాలా సైలెంట్, అలాగే షై కూడా.. సెట్ లో నాకు చాలా హెల్ప్ చేసారు. ముఖ్యంగా, డైలాగ్స్ చెప్పేటప్పుడు నాకు ఎన్నో టిప్స్ చెప్పారు. ఆయనతో టైమ్ స్పెండ్ చేయడం నాకు బాగా నచ్చింది. నాకు ఇప్పటికి ఏడు ల్యాంగ్వేజ్ లు తెలుసు. తెలుగు కూడా త్వరలోనే నేర్చుకుంటా.
టాలీవుడ్ కి.. బాలీవుడ్ కి తేడా ఏమైనా గమనించారా?
- నాకు టాలీవుడ్ చాలా కొత్త. సో, ఇప్పుడే ఆ విషయం గురించి నేను చెప్పలేను. ప్రస్తుతానికి అందరూ ప్రొఫిషనల్స్ గా వర్క్ చేస్తున్నారు.
బుల్లితెరపై కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు?
- నేను సినిమాలతో పాటు, వెబ్ షోలు చేశాను, అలాగే పాడతాను కూడా, వీటన్నిటిని బ్యాలెన్స్ చేయడంలో పర్ఫెక్ట్ అని నా బలమైన నమ్మకం. అలాగే, నాకు నచ్చింది చేయడం చాలా ఇష్టం. మీకు నచ్చింది చేయాలనుకున్నప్పుడు ఎంత రష్ ఉన్న వాటిని బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం. నేను అలాంటి లైఫ్ ని ఇష్టపడతాను.
రాబోయే రెండేళ్లలో మిమ్మల్ని మీరు ఎలా చుసుకోబోతున్నారు?
- నేను ఖచ్చితంగా ఇలా ఉంటాను అని చెప్పలేను. కానీ, నాకు సింగింగ్ అంటే ఇష్టం. దాని మీద దృష్టి పెడదామని నా ఆలోచన. నేను 2022లో ప్రారంభించిన 2 పాటలు రీలిజ్ అయ్యాయి. 3వ పాట కూడా త్వరలో వస్తోంది. వీటితో పాటు తప్పకుండా మరిన్ని తెలుగు సినిమాలు చేయాలని ఉంది.
నెక్స్ట్ మీ రాబోయే సినిమాలు ఏమిటి?
-నవాజుద్దీన్ సిద్ధిఖీతో....సంగీన్ అనే ఒక థ్రిల్లర్ రాబోతుంది. 'రాణీతి' అనే మూవీ జియో సినిమాలో విడుదలయ్యే సిరీస్. నేను చేస్తున్న పాట 'వోహ్' కూడా అదే ప్లాట్ ఫార్మ్ లో రీలిజ్ అవ్వుతుంది. అలా, పైప్‌లైన్‌లో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మీకు త్వరలో తెలుస్తుంది.. అంటూ ఇంటర్వ్యూ ముగించింది.....