గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 27 డిశెంబరు 2023 (15:16 IST)

డెవిల్ ఒరిజినల్ దర్శకుడిని పక్కకు నెట్టిన కళ్యాణ్ రామ్? కారణం?

Devil origina director naveen
Devil origina director naveen
నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా డెవిల్. అమెరికన్ గూఢచారి కథనేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాను ఈనెల 29 న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా కళ్యాణ్ ముందు అసలు దర్శకుడు నవీన్ గురించి ప్రస్తావిస్తే, మీరెంతగా అటు ఇటుగా అడిగినా సినిమా విడుదల తర్వాత నేనే అన్నీ చెబుతానన్నారు. సినిమా పోస్టర్లలో నిర్మాత అభిషేక్ నామా పేరు దర్శకుడిగా వుంటుంది. ఈ నిర్మాత కార్తికేయ౨ సినిమాను నిర్మించారు. మరి దర్శకుడిగా అనుభవం లేకుండా ఎలా దర్శకుడిగా ఎంపిక చేశారంటే, బింబిసారా సినిమా దర్శకుడికి కూడా అనుభవంలేదని కళ్యాన్ రామ్ సెలవిచ్చారు.
 
ఇది జరిగిన కొన్ని గంటల్లోనే అసలు దర్శకుడు నవీన్ మేడారం సోషల్ మీడియాలో తన ఆవేదనను వ్యక్తం చేశారు. మొత్తం వైాజాగ్, హైదరాబాద్, కర్లకుడి వంటి లొకేషన్లలో 105 రోజులు షూటింగ్ కూడా చేశాను. ఔట్ పుట్ బాగా వచ్చింది. ఇది ప్రాజెక్ట్ కాదు నా బేబి. దానిని నాకు దక్కుండా చేశారు. 
 
ఈసినిమా నాకు మూడేళ్ళ కష్టం. ప్రతిదీ కేర్ తీసుకుని చేశాను. కానీ కొన్ని ఇగోల వల్ల వారు తీసుకున్న నిర్ణయం బాధించింది. ఇంతకాలం మౌనంగా వుండడం తన చేతకాని తనం కాదని ఆవేదన వెలిబుచ్చారు. అయినా ఎవరిపై చర్య తీసుకునే ఉద్దేశ్యం తనకు లేదనీ, ఈ సినిమాకు హీరో బాగా కష్టపడిపూర్తిచేశారని సినిమా తప్పకుండా హిట్ అవుతుందని పేర్కొన్నారు. మరి ఈ సినిమా అసలు దర్శకుడి గురించి సినిమా విడుదల తర్వాత ఏమైనా హీరో, నిర్మాత చెబుతారో చూడాలి. అసలు తెరవెనుక ఏం జరిగింది? అనేది కొద్ది రోజుల్లో తేలనుంది.