సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 26 డిశెంబరు 2023 (14:19 IST)

దేవర అప్ డేట్ గురించి కళ్యాణ్ రామ్ ఏమన్నారంటే..

Devara latest
Devara latest
ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా `దేవర`. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రమిది. ఎన్.టి.ఆర్. ఆర్ట్స్ బేనర్ లో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమా అప్ డేట్ గురించి మాట్లాడుతూ, నేను, తారక్ ఇద్దరమూ ఏదైనా అప్ డేట్ ఇవ్వాలంటే అనుకుని ఇస్తాం. ముందుగా సినిమాను హైప్ క్రియేట్ చేయకుండా జాగ్రత్త పడుతున్నాం. మేం ముందుగా ఏదైనా షూట్ గురించి మాట్లాడితే అది జనాల్లో రెండు, మూడు రోజుల వరకే వుంటుంది. తర్వాత మర్చిపోతారని నిర్మొహమాటంగా అన్నారు.
 
కానీ ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు, ఈ చిత్రం ఇప్పటివరకు షూటింగ్ 80 శాతం కంప్లీట్ అయ్యింది.  అలాగే దేవర గ్లింప్స్ జనవరిలో విడుదల చేస్తున్నాం. టెక్నికల్ గా అన్ని పనులు జరుగుతున్నాయి. అయితే పార్ట్ - 1 మాత్రమే 80 శాతం కంప్లీట్ చేశాం. రెండో పార్ట్ ఇంకా మొదలు పెట్టలేదు అని తెలిపారు. ఇక సోషల్ మీడియాలో గ్లింప్స్, సినిమా విడుదల తేదీ గురించి అప్ డేట్ ఇచ్చేశారు. ఏప్రిల్ లో సినిమా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.