గురువారం, 13 జూన్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 11 డిశెంబరు 2023 (16:10 IST)

ప్రజ్వల్ దేవరాజ్ కరావళి ఫస్ట్ లుక్, ప్రోమో విడుదల

Prajwal Devaraj
Prajwal Devaraj
కరావళి అనే గ్రామంలో కంబాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ప్రజ్వల్ దేవరాజ్ నటించిన ఈ 40వ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, ప్రోమోలను నేడు విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్‌లో ప్రజ్వల్ దేవరాజ్ ఇది వరకెన్నడూ కనిపించని లుక్కులో కనిపించబోతున్నారు. మహిషా అవతారం అన్నట్టుగా అలా మహిషం మీద కదిలి వచ్చే సీన్ చూస్తే గూస్‌బంప్స్ రావాల్సిందే.
 
ఓ వైపు గేదె ప్రసవం, మరో వైపు హీరో జననం.. ఈ రెండింటికి ఏదో లింక్ ఉన్నట్టుగా చూపించడం.. చివరకు హీరో కాస్తా మహిషాసురుడు అయ్యాడన్నట్టుగా వెరైటీ గెటప్‌లో కనిపించే షాట్ అదిరిపోయింది. చూస్తుంటే పాన్ ఇండియాకు పర్‌ఫెక్ట్ సబ్జెక్ట్ అన్నట్టుగా కనిపిస్తోంది. విజువల్స్, ఆర్ఆర్ కూడా ఆ స్థాయిలోనే ఉన్నాయి.
 
మా భాష, సంస్కృతి, ఆచార సంప్రదాయాలు, మా మూలల్లోంచి కథలు తీసుకుని తెరపై ఆవిష్కరించాలని అనుకుంటున్నామని దర్శక నిర్మాత గురుదత్త గనిగ తెలిపారు.
 
ప్రజ్వల్ దేవరాజ్ ‘కరావళి’ సినిమాతో అందరినీ పలకరించబోతున్నారు. ‘అంబి నింగే వయసైతో’ తో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు గురుదత్త గనిగ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. వీకే ఫిల్మ్స్ బ్యానర్‌తో కలిసి గురుదత్త గనిగ ఫిల్మ్స్‌ బ్యానర్ మీద గురుదత్త గనిగ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
ఈ చిత్రానికి సచిన్ బస్రూర్ సంగీతం అందిస్తుండగా.. అభిమన్యు సదానందన్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం థియేటర్లోకి రానుంది.