శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 11 డిశెంబరు 2023 (09:36 IST)

యంగ్ దేవరగా ఎన్.టి.ఆర్. లుక్ తో ఏప్రిల్ లో వస్తున్నానంటూ లేటెస్ట్ అప్డేట్

Young ntr
Young ntr
ఎన్.టి.ఆర్. ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా దేవర. సముద్ర నేపథ్యంలో పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి నేడు యంగ్ దేవరగా ఎన్.టి.ఆర్. లుక్ చిత్ర యూనిట్ పోస్ట్ చేసింది. ఏప్రిల్ 5 న వస్తున్నట్లు పోస్టర్ విడుదల చేశారు. డిసెంబర్ 20 న గ్లింప్స్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. 
 
రెండు భాగాలుగా రాబోతున్న ఈ దేవర మొదటి భాగం వి.ఎఫ్.ఎక్స్. పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని తెలియజేశారు.  ఇక ఈ సినిమాలో ‘కె.జి.యఫ్’లో దయాగా పాపులర్ అయిన తారక్ పొన్నప్ప దేవర’లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. జాన్వికపూర్ నాయికగా నటి్స్తు్నన ఈ చిత్రాన్ని ఎన్.టి.ఆర్. ఆర్ట్స్ పతాకంపై రూపొందిస్తున్నారు.