శుక్రవారం, 1 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 8 డిశెంబరు 2023 (19:26 IST)

ఎన్టీఆర్, కొరటాల శివను కలిసిన నెట్ ఫ్లిక్స్ సీఈఓ

Netflix CEO, NTR
Netflix CEO, NTR
నెట్ ఫ్లిక్స్ సీఈఓ టెడ్ సరండోస్ నిన్న రామ్ చరణ్, చిరంజీవిలను కలిసి గౌరవపూర్వకంగా గడిపారు. ఆ తర్వాత అల్లు అర్జున్, మహేష్ బాబును కూడా ఆయన కలిశారు. ఈరోజు ఎన్టీఆర్ ను కలిశారు. ఈ భేటీలో కళ్యాణ్ రామ్, కొరటాల శివ తదితరులు వున్నారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులకు తెలియజేశారు.
 
ఈ రోజు టెడ్ సరండోస్ ను ఎ.న్.టి.ఆర్. ఇంటికి పిలిచి, ఆతిథ్యం అందించారు. టెడ్ సరండోస్ కి, అతని టీమ్ ను హోస్ట్ చేయడం ఆనందం గా ఉంది అని ఎన్టీఆర్ పేర్కొన్నారు. అతనితో కొన్ని విషయాలను చర్చించినట్లు తెలిపారు. అందుకు సంబందించిన ఫోటోలను జూనియర్ ఎన్టీఆర్ షేర్ చేశారు. దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం లో దేవర అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ లో ఎన్టీఆర్ నటిస్తున్నారు.